Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు…

ఖమ్మం నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు…
అసాంఘిక కార్యకాలపాలకు అడ్డుకట్ట
ఆకతాయిల అల్లర్లపై కఠిన చర్యలు
నేరాల నియంత్రణ ,ప్రజాభద్రత లక్ష్యం
సీపీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాలతో జిల్లాలలో తనిఖీలు నిర్వయించిన పోలీసులు

అసాంఘిక కార్యకాలపాలకు అవకాశం లేకుండా ఆర్ధరాత్రి మద్యం మత్తులో తిరిగే అకాతాయిలను అడ్డుకట్ట వేసేందుకు నగరంలో పలు ప్రాంతాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

నేరాల నియంత్రణ, ప్రజా భద్రతకు భరోసా కల్పిచేందుకు నిరంతరం తనిఖీలు కొనసాగిస్తూ ….అసాంఘిక కార్యకలాపాలపై, నేరస్తుల కదలికపై నిఘా ఉండాలన్న పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం వాటిల్లకుండా, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా, మాదక ద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులు వంటి వాటి యొక్క అక్రమ రవాణా నిరోధించే ఉద్దేశంతో ప్రతి చోట క్షుణ్ణంగా తనిఖీ చేస్తూన్నారు. అనుమానిత వ్యక్తులు గాని, వాహనాలు గాని తారసపడితే వాటి గురించి పూర్తి వివరాలను సేకరించి, అనంతరం వారికి వెసులుబాటు కల్పిస్తున్నారు. అదేవిధంగా బైక్‌ ర్యాష్ డ్రైవింగ్, సౌండ్ పొల్యూషన్, ఈవ్ టిజింగ్, అర్ధరాత్రి రోడ్లపై పుట్టిరోజు వేడుకలు చేస్తూ… అసాంఘీక కార్యకాలపాలపై ప్రత్యేక దృష్టి సారించి చెక్ పెట్టాలని పోలీస్ కమిషనర్ సూచనలతో పోలీస్ అధికారులకు దృష్టి సారించారు. అకస్మిక డ్రంక్ &డ్రైవ్ తనీఖీలు నిర్వహించారు.

Related posts

ఆనందయ్య మందుపై : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు!

Drukpadam

చలిపులి …వణుకుతున్న ఏజన్సీ ప్రాంతాలు ….

Drukpadam

సోమనాథ్ ట్రస్ట్ కు ముఖేష్ విరాళం 1 ,51 కోట్లు …

Drukpadam

Leave a Comment