Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్టీలు అన్ని ఏకమైనా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది: మంత్రి పెద్దిరెడ్డి

పార్టీలు అన్ని ఏకమైనా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది: మంత్రి పెద్దిరెడ్డి
మూడు రాజధానులు కట్టుబడి ఉన్నాం
ఇందులో మరో మాటకు తావులేదు
రాజధానిపేరుతో చంద్రబాబు డైరక్షన్ లో దండయాత్ర చేశారు
బీజేపీ తో పొత్తుకు చంద్రబాబు తహతహ
రాజధాని యాత్ర కాదు రాజకీయయాత్ర
ఒకే చోటనే అభివృద్ధి కాదుఅన్ని ప్రాంతాలకు అభివృద్ధి సీఎం జగన్ లక్ష్యం

తెలుగుదేశం పార్టీ ముసుగులో అమరావతి ఉద్యమం సాగుతోందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఎవరెన్ని అనుకున్న రాష్ట్ర లోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని అందుకే మూడు రాజధానుల తుసుకురాబోతున్నామని అన్నారు. అందులో మరోమాటకు తావు లేదని అన్నారు. రాజధాని పేరుతొ చంద్రబాబు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మండి పడ్డారు. అది రాజధాని యాత్ర కాదని ప్రజలపై దండయాత్ర అని అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
భాజపాతో ఎలాగైనా జట్టు కట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని పార్టీలు జట్టుకట్టినా వైకాపా ఒంటరిగానే పోటీ చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇవాళ తిరుపతిలో అమరావతి మహా ఉద్యమసభ నిర్వహించిన విషయం తెలిసిందే. సభకు వైకాపా సిపిఎం మినహా అన్ని రాజకీయ పక్షాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. ఈనేపథ్యంలో పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు. చంద్రబాబు కుర్చీ కోసం చేసే ఆందోళనలో రాజధాని అని పేరుతొ మరో మోసం చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆయన రాజకీయ వేదికపై కూడా కనపడింది బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన పడ్డ తాపత్రయం చూశామని అన్నారు. ఎక్కడో ఉన్న కన్నాను తనపక్కకు పిలిచి నిలబెట్టుకోవడం టీవీ డిబేట్లలో కూడా చర్చనీయాంశంగా మారింది .

అయితే రాజధానిపేరుతో ఒకే వేదికను పంచుకున్న నేతలు ఎన్నికల్లో తలొకదారి పోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. సిపిఎం బీజేపీ తో ఎక్కడ వేదికను పంచుకోమని స్పష్టం చేసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ వస్తారన్న ఆయన రాలేదు.

Related posts

ప్యాకేజి స్టార్ అంటే చెప్పుతీసుకొని కొడతా …పవన్ కళ్యాణ్ అసహనం !

Drukpadam

సోము వీర్రాజును ఇకపై ‘సారాయి వీర్రాజు’ అని పిలవాలేమో…సీపీఐ రామకృష్ణ!

Drukpadam

పంజాబ్ లో మారుతున్న రాజకీయం.. అమిత్ షాతో భేటీ అయిన అమరీందర్ సింగ్!

Drukpadam

Leave a Comment