Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పాకిస్థాన్ పై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడిన అమెరికా!

పాకిస్థాన్ పై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడిన అమెరికా!

ప్రపంచ ఉగ్రవాదం 2020 నివేదిక విడుదల

ఉగ్రవాదులపై పాక్ చర్యలు తీసుకోవడంలేదన్న అమెరికా

ఉగ్రవాదులు పాక్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని వెల్లడి

పాక్ కేంద్రంగానే భారత్ పై ఉగ్రదాడులు జరిగాయని వివరణ

అగ్రరాజ్యం అమెరికా మరోసారి పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. 2020 ఏడాదికి గాను ప్రపంచ ఉగ్రవాదం తీరుతెన్నులపై అమెరికా తాజాగా నివేదిక విడుదల చేసింది.  పాకిస్థాన్ కేంద్రంగానే భారత్ పై ఉగ్రదాడులకు కుట్రలు జరిగాయని అందులో ఆరోపించింది.

పాకిస్థాన్ దాదాపు 12 ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా మారిందని వెల్లడించింది. ముష్కర మూకలపై పాకిస్థాన్ చర్యలు తీసుకోవడంలేదని, ముంబయి దాడుల సూత్రధారులపైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అమెరికా వివరించింది. ఉగ్రవాదులు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, వాటి అనుబంధ సంస్థలు పాక్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఆరోపించింది.

పాక్ లోని కొన్ని మదర్సాల్లో తీవ్రవాద భావజాలం నూరిపోస్తున్నారని అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో అమెరికా… భారత్ పై ప్రశంసలు కురిపించింది. భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించడంలో ఎన్ఐఏ సమర్థంగా పనిచేస్తోందని కితాబిచ్చింది.

Related posts

తన హత్యకు కుట్ర జరుగుతోంది: రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణ!

Drukpadam

ఎవడ్రా మమ్మల్ని ఆపేది?: రేణుకా చౌదరి ఫైర్….

Drukpadam

ఢిల్లీలో తెలంగాణా నేతలతో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా ,నడ్డా భేటీ!

Drukpadam

Leave a Comment