Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్యేలను గెలిపించే భాద్యత నాదే… పార్టీ మీటింగ్ లో కేసీఆర్!

ఎమ్మెల్యేలను గెలిపించే భాద్యత నాదే… పార్టీ మీటింగ్ లో కేసీఆర్!
-అందరికి అవకాశాలు వస్తాయి …ఎవరు నిరాశ పడవద్దు
-నల్లగొండలో కోటిరెడ్డి కి వచ్చింది చూడండి
-ఓపిక పట్టాలి అంతే
-ఎమ్మెల్యేలు మౌనంగా ఉండవద్దు
-పంట మార్పిడిపై రైతులను చెతన్యం చేయాలి
-ఈనెల 20 రాష్ట్రవ్యాపిత నిరసనలు …కేంద్ర దిష్టిబొమ్మలు దగ్ధం
-బీజేపీ తో యుద్ధమే …ధాన్యం కొనుగోలుపై మంత్రులు ఢిల్లీకి

కేసీఆర్ నేడు టీఆర్ యస్ భవన్ లో మంత్రులు ఎమ్మెల్యేలు , ఎంపీ లు , ఎమ్మెల్సీలతో ఇతర ప్రజా ప్రతినిధులతో కార్పొరేషన్ చైర్మన్ లతో సమావేశం నిర్వహించారు. అందులో కేసీఆర్ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ఎమ్మెల్యేలకు భరోసా నివ్వడం చర్చనీయాంశం అయింది. ఇటీవల బీజేపీ తో చాలామంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో కేసీఆర్ మాటలకు ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్రంపై గుర్రుగా ఉన్న కేసీఆర్ బీజేపీ వ్యతిరేకంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనికి శ్రీకారం చుట్టారు . ఇప్పటివరకు ఇక ఎత్తు ఎప్పటినుంచి ఇక ఎత్తుల కేసీఆర్ ప్రసంగం సాగింది . ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరిపై కేసీఆర్ ఆగ్రంగా ఉన్నారు . రైతులకు ధాన్యం బదులు ప్రత్యాన్మాయ పంటలు వేసేలా ప్రోత్సహించాలని అలర్టుగా ఉండాలని ఎప్పటికప్పుడు స్పందించాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర రైతాంగ స‌మ‌స్య‌ల‌ను పట్టించుకోని కేంద్రంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి యుద్ధం ప్ర‌క‌టించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. కేంద్రం వైఖ‌రిని నిల‌దీస్తూ.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు. నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మ‌ల‌ను ద‌గ్దం చేయాలన్నారు.

టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేంద్రం వైఖ‌రి ప‌ట్ల ఏం చేయాలో పార్టీ శ్రేణుల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి కేంద్రం చేతులెత్త‌య‌డంతో.. ఈ విష‌యాన్ని రైతుల‌కు వివ‌రించాల‌ని చెప్పారు. వ‌రికి బ‌దులుగా ఇత‌ర పంట‌లు వేయాల‌ని సూచించారు. ఈ నెల 18న రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి కేంద్ర మంత్రిని క‌ల‌వ‌నున్న‌ట్లు కేసీఆర్ వెల్ల‌డించారు.

Related posts

మునుగోడు ఎన్నికల వేళ బీజేపీకి గట్టి షాక్ …

Drukpadam

చిరంజీవి మళ్ళీ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారా ?

Drukpadam

మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం.. కాంగ్రెస్ సభ్యుల నిరసన!

Drukpadam

Leave a Comment