Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ ఔరంగజేబులా మారితే తెలంగాణలోనూ శివాజీలు పుట్టుకొస్తారు: బండి సంజయ్!

కేసీఆర్ ఔరంగజేబులా మారితే తెలంగాణలోనూ శివాజీలు పుట్టుకొస్తారు: బండి సంజయ్!
వారణాసిలో మోదీ దివ్య కాశీ భవ్య కాశీ కార్యక్రమం
కేసీఆర్ విమర్శలు చేశారన్న సంజయ్
దేశంలో ఎవరూ విమర్శించలేదని వ్యాఖ్య
కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఉద్ఘాటన
ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌తో నా గుండె త‌రుక్కుపోతోంది
రాష్ట్ర‌ ప్ర‌భుత్వ త‌ప్పిదంతోనే ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు
ఆన్ లైన్ త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌లోనూ సర్కారు విఫ‌లం
ఉత్తీర్ణులు కాలేక‌పోయిన వారిలో పేద విద్యార్థులే అధికం
గ‌తంలోనూ కేటీఆర్ బినామీ నిర్వాకంతో 27 మంది విద్యార్థుల బ‌లి
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు మంత్రులతోనూ, ఎమ్మెల్యేలతోనూ సమావేశం ఏర్పాటు చేసి ఏం వాగాలో అంతా వాగారని వ్యాఖ్యానించాడు

“అన్ని విషయాలు బయటికొస్తుండేసరికి వాళ్ల ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోతున్నారు కేసీఆర్ ఇంత భయపడుతున్నాడేంటి? అనుకుంటున్నారు” అని వెల్లడించారు। ప్రధాని మోదీ వారణాసిలో నిర్వహించిన దివ్య కాశీ భవ్య కాశీ కార్యక్రమంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రిగా ఆయన స్థాయికి తగనివని అన్నారు

దివ్య కాశీ భవ్య కాశీ కార్యక్రమం గురించి దేశంలో కాంగ్రెస్ పార్టీ సహా ఎవరూ విమర్శించలేదని, కానీ కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బండి సంజయ్ పేర్కొన్నారు। “పాపం, ఈయన నిజమైన హిందువు కాబట్టి విమర్శించాడు! అయినా మోదీ ఏం మాట్లాడారు?।।। నీలాగా చైనాను సమర్థించలేదు, పాకిస్థాన్ ను సమర్థించలేదు, బంగ్లాదేశ్ ను సమర్థించలేదు। ఎక్కడ ఔరంగజేబులు పుట్టుకొస్తే అక్కడ శివాజీలు ఉద్భవిస్తారు అని మోదీ అన్నారు। అదేమైనా తప్పా?” అని ప్రశ్నించారు। మున్ముందు తెలంగాణలో అదే జరుగుతుందని అన్నారు। “నువ్వు ఔరంగజేబులా మారుతున్నావు।।। తెలంగాణలోనూ శివాజీలు ఉద్భవిస్తారు” అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు।

తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ మొదటి సంవత్సరం ప‌రీక్ష ఫ‌లితాల వివాదం నేప‌థ్యంలో ఈ అంశంపై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు। ఈ రోజు ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ।।। రాష్ట్ర‌ ప్ర‌భుత్వ త‌ప్పిదంతోనే ఇంట‌ర్ విద్యార్థులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు।

ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌తో గుండె త‌రుక్కుపోతోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు। నూరేళ్ల బంగారు భ‌విష్య‌త్తును ఇంట‌ర్ విద్యార్థులు నాశ‌నం చేసుకోకూడ‌ద‌ని ఆయ‌న సూచించారు। క‌రోనా వేళ‌ ఆన్ లైన్ త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌లోనూ రాష్ట్ర సర్కారు అస‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆయ‌న ఆరోపించారు। ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులు కాలేక‌పోయిన వారిలో పేద విద్యార్థులే అధికంగా ఉన్నార‌ని ఆయ‌న అన్నారు।

గ‌తంలోనూ మంత్రి కేటీఆర్ బినామీ నిర్వాకంతో 27 మంది విద్యార్థులు బ‌లి అయ్యార‌ని ఆయ‌న తెలిపారు। స‌ర్కారు నిర్వాకం వ‌ల్ల ఇంకా ఎంత మంది ఇంట‌ర్ విద్యార్థులు బ‌లికావాల‌ని ఆయ‌న నిల‌దీశారు। జ‌వాబు ప‌త్రాల‌ రీ-వాల్యుయేష‌న్ ను ఉచితంగా చేయించాల‌ని ఆయ‌న చెప్పారు। విద్యార్థుల‌కు తాము అండ‌గా ఉంటామ‌ని, ఎవ్వ‌రూ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ని బండి సంజ‌య్ భ‌రోసా ఇచ్చారు।

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం జగన్నాథపల్లి గేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు। ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు। మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు। మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు। ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించాలని అన్నారు। రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ ప్రమాదంపై పలువురు నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు

Related posts

2024 ఎన్నికల్లో బీజేపీ 250 స్థానాలకే పరిమితం…కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ జోస్యం!

Drukpadam

ఢిల్లీ ఎయిర్​ పోర్టులో ప్రయాణికుల ఇక్కట్లు.. కేంద్ర విమానయానశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ!

Drukpadam

ఆప్ ఉచిత పథకాలను గుజరాత్ ప్రజలు తిరస్కరించారు ..అమిత్ షా !

Drukpadam

Leave a Comment