Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అమేథి లో రాహుల్, ప్రియాంక కవాత్…భారీగా స్పందన!

అమేథి లో రాహుల్, ప్రియాంక కవాత్…భారీగా స్పందన!
-మీ ప్రేమ ఎప్పటికి మర్చిపోలేనన్న రాహుల్ గాంధీ
-రాజకీయ ఓనమాలు నేర్పింది మీరేనని ఉద్ఘాటన
-ప్రజల కళ్లలో ఆగ్రహావేశాలు తప్ప అమేథీలో ఏ మార్పు లేదని వ్యాఖ్య
-అమేథీలో ప్రతి వీధి అలాగే ఉందని వెల్లడి

తన పాత నియోజకవర్గం అమేథిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ కవాతులో రాహుల్ సోదరి, కాంగ్రెస్ పార్టీ యూపీ ఇన్చార్జి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. 2019 ఎన్నికల తర్వాత రాహుల్ అమేథిలో పర్యటించడం ఇది రెండోసారి. అమేథి వచ్చిన సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, అమేథీలో ప్రతి వీధి అలాగే ఉందని అన్నారు. ప్రజల కళ్లలో ప్రభుత్వంపై ఆగ్రహం తప్ప అమేథీలో ఏ మార్పు లేదని వ్యాఖ్యానించారు.

“గతంలో మాదిరే ఇక్కడి ప్రజల హృదయాల్లో ఇప్పటికీ స్థానం ఉందని భావిస్తున్నాను. ఇప్పటికే మేం అన్యాయానికి వ్యతిరేకంగా ఐక్యంగానే ఉన్నాం. 2004లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా తొలి ఎన్నికల్లో నేను పోటీ చేసింది అమేథీ నుంచే. రాజకీయాల గురించి ఇక్కడి ప్రజలు ఎంతో నేర్పించారు. రాజకీయాల సరళి ఎలా ఉంటుందో మీరు నాకు మార్గదర్శనం చేశారు. అందుకే ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని వివరించారు.

గత లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీ, కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయడం తెలిసిందే. అయితే అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓటమిపాలయ్యారు. అదే సమయంలో వాయనాడ్ లో మాత్రం విజయం సాధించారు.

Related posts

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై అన్న అజారే మండిపాటు …

Drukpadam

ఈ తీర్పు దురదృష్టకరం” సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి!

Drukpadam

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు!

Drukpadam

Leave a Comment