Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రోడ్డు ప్రమాద బాధితులకు తొలి 48 గంటలు ఉచిత వైద్యం: స్టాలిన్

రోడ్డు ప్రమాద బాధితులకు తొలి 48 గంటలు ఉచిత వైద్యం: స్టాలిన్
-ప్రమాదంలో గాయపడిన వారికి తొలి 48 గంటలు ఎంతో కీలకం
-అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్న సీఎం
-ఏ ప్రాంతం వారైనా తమిళనాడులో ప్రమాదం జరిగితే పథకం వర్తింపు

తన రాజకీయ అనుభవాన్ని రంగరించి వినూత్న విధానాలతో ముందుకు పోతున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ ప్రజల్లో తనకంటూ ప్రత్యేకతను చాటు కుంటున్నారు. ప్రజలే కాకుండా ప్రత్యర్థులు సైతం వేలెత్తి చూపలేకుండా పాలనా సాగుతుంది. తన అనుభవాలతో ప్రజలలో మంచి పేరు సంపాదిస్తున్నారు .

అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన పాలనతో ముద్ర వేసుకుంటూ ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తొలి 48 గంటలు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇన్నుయిర్ కాప్పోమ్ (ప్రాణాలను కాపాడదాం) పేరుతో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇన్నుయిర్ కాప్పోమ్-నమైకాక్కుమ్-48 పథకం కింద తొలి 48 గంటలు వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం 201 ప్రభుత్వ ఆసుపత్రులు, 408 ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వం ఎంపిక చేసింది.

బాధితులు ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా తమిళనాడులో ప్రమాదం జరిగితే ఈ పథకం వర్తిస్తుంది. ప్రమాదాల్లో గాయపడిన వారికి తొలి 48 గంటలు ఎంతో కీలకం కావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. చెంగల్‌పట్టు జిల్లా మేల్ మరువత్తూర్‌లోని ఆదిపరాశక్తి వైద్య కళాశాలలో స్టాలిన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలను కలుసుకునేందుకు స్వయంగా సీఎం స్టాలిన్ వరదల్లోని నడుచుకుంటూ వెళ్లారు. బస్సు లలో సౌకర్యాలపై స్వయంగా చెన్నై నగరంలో సిటీ బస్సు లు వెక్కి పరిశీలించారు . రోడ్ పక్కన తనకోసం వెచ్చిస్తున్న ఒక వ్యక్తి కోసం ఆగి విజ్ఞాపన తీసుకున్నారు. ఎక్కడ సమస్య ఉంటె అక్కడుకు వెళ్లి దాని పరిస్కారం కోసం కృషిచేస్తున్నారు. అసెంబ్లీ లో క్యాంటిన్ లో కాకుండా ఎవరి భోజనాలు వారే తెచ్చుకోవాలని ఎమ్మెల్యే లకు ఆదేశాలు జారీచేశారు .

Related posts

పొంగులేటి …జూపల్లి కాంగ్రెస్ కు జై !…15 సీట్లు ఇచ్చే అవకాశం …?

Drukpadam

భట్టితో రాహుల్ ప్రత్యేక మంతనాలు.. గన్నవరం వరకు ఒకే కారులో ప్రయాణం!

Drukpadam

జనసేన-బీజేపీ నేతల సమన్వయ సమావేశం.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు!

Drukpadam

Leave a Comment