Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి యువకుడి వీరంగం.. కొట్టి చంపిన భక్తులు!

అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి యువకుడి వీరంగం.. కొట్టి చంపిన భక్తులు!
-బంగారు కడ్డీలను దాటి లోపలికి ప్రవేశం
-కత్తి తీసుకుని పూజారి వద్దకు వెళ్లి హల్‌చల్
-దైవద్రోహానికి పాల్పడ్డాడంటూ భక్తుల ఆగ్రహం
-మూకుమ్మడిగా దాడిచేసిన భక్తులు
-విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి

సిక్కులకు ఎంతో పవిత్రమైన పంజాబ్‌ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో నిన్న సాయంత్రం ఊహించని ఘటన జరిగింది. ఓ యువకుడు (25) దేవాలయంలోకి ప్రవేశించి గర్భగుడిలోకి చొరబడ్డాడు. బంగారు కడ్డీలతో ఏర్పాటు చేసిన కంచె మీదుగా లోపలికి దూకి అక్కడున్న కత్తిని చేతపట్టాడు. అక్కడే ఓ మూలన పవిత్ర గురుగ్రంథ్ సాహిబ్ చదువుతున్న పూజారి వద్దకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేశాడు. గర్భగుడిలోకి ప్రవేశించడమంటే దైవద్రోహానికి పాల్పడినట్టుగా సిక్కులు భావిస్తారు.

గర్భగుడిలోకి వెళ్లి కత్తితో హంగామా చేసిన అతడిని పట్టుకున్న శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) టాస్క్‌ఫోర్స్ ఆ యువకుడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం కమిటీ కార్యాలయానికి అతడిని తరలిస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా అతడిపై దాడిచేశారు. వారి దెబ్బలకు తాళలేని యువకుడు మృతి చెందాడు. బాధిత యువకుడిది ఉత్తరప్రదేశ్‌గా గుర్తించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు. యువకుడు ఆలయంలోకి ఎప్పుడు ప్రవేశించాడు? ఒక్కడే వచ్చాడా? అతడివెంట మరెవరైనా ఉన్నారా? అతడు ఎవరు? అన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆలయంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ విచారణకు ఆదేశించారు.

Related posts

ఖమ్మం గుప్త హోటల్ నిర్వాకుల కొత్త ఆలోచన!

Drukpadam

ఏపీ సహా ఐదు రాష్ట్రాల అప్పులపై ‘ది ప్రింట్’ సంచలనాత్మక కథనం..

Drukpadam

విడాకుల కేసులో ఇజ్రాయెల్ కోర్టు విచిత్రమైన తీర్పు..

Drukpadam

Leave a Comment