Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తిరుపతిని రాజధానిని చేయండి: మాజీకేంద్ర మంత్రి చింతా మోహన్!

తిరుపతిని రాజధానిని చేయండి: మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్!
మోదీ వేసిన పునాది అనాథగా మిగిలింది..
సూళ్లూరుపేటలో పర్యటించిన చింతా మోహన్
ఏర్పేడు-రావూరు మధ్య 1.5 లక్షల ఎకరాల భూమి
అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే 13 జిల్లాలకూ అందుబాటు
దుగరాజపట్నం ఓడరేవు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు

ఒకే రాజధాని మూడు రాజధానుల అంశం పై ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఆందోళనలు నిర్వహిస్తుండగా , మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత చింత మోహన్ కొత్త ప్రతిపాదన తెచ్చారు . అమరావతి లో మోడీ వేసిన పునాది అనాధగా మిగిలిందని అందువల్ల తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేయడం మంచిదని ,ఇది అందరికి అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాల ప్రజలు రాజధాని విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తుండగా చింత మోహన్ కొత్త ప్రతిపాదన ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనే ప్రస్నార్ధకమే ?

ఏపీ రాజధాని విషయంలో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సూళ్లూరుపేటలో నిన్న పర్యటించిన ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

అమరావతిలో ప్రధాని వేసిన పునాది అనాథగా మిగిలిందన్నారు. ఆయన పరిపాలన అధ్వానంగా ఉందన్నారు. పీఎం కార్యాలయం నల్లధనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పైనా మోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ప్రభుత్వం పతనావస్థలో ఉందని విమర్శించారు. దుగరాజపట్నం ఓడరేవు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని మోహన్ ఆరోపించారు. అమరావతి రైతులకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందన్నారు.

ఏర్పేడు-రావూరు మధ్య 1.5 లక్షల ఎకరాలు రాజధాని కోసం అందుబాటులో ఉందన్న డాక్టర్ మోహన్.. అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే 13 జిల్లాలకూ అందుబాటులో ఉంటుందన్నారు. కండలేరు, సోమశిల జలాశయాలతోపాటు తిరుపతికి ఏడు జాతీయ రహదారుల కలయిక, అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉందని వివరించారు. కాబట్టి తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేయడం ఉత్తమమని సూచించారు.

Related posts

ఆశక్తి గొల్పుతున్న బిన్ లాడెన్ లేఖలు ….

Drukpadam

మోదీకి అచ్చే దిన్ పూర్తయ్యాయి: శత్రుఘ్న సిన్హా..

Drukpadam

లోకసభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు …రెండు రాష్ట్రాలుగా కర్ణాటక …?

Drukpadam

Leave a Comment