Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హెల్మెట్ లేకుండా బైక్ తీస్తే కేసే…హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సీరియస్ వార్నింగ్!

హెల్మెట్ లేకుండా బైక్ తీస్తే కేసే…హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సీరియస్ వార్నింగ్!
వెనుక కూర్చున్నవారికీ హెల్మెట్ తప్పనిసరి
ఈ ఏడాది ఇప్పటికే 11.54లక్షల కేసుల నమోదు
హెల్మెట్ లేకే ప్రమాదాల్లో మరణాలు
నిబంధనలు తూచా తప్పకుండ పాటించాల్సిందే

హెల్మెట్ పెట్టుకొని ద్విచక్ర వాహనం నడపాలని పోలీసులు నిత్యం చెపుతుంటారు .నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా నేపథ్యంలో భద్రతా కోసం నిబంధన పెట్టారు .దాన్ని పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారన్న సందర్భంలో హెల్మెట్ వాడటం లేకపోతె హెల్మెట్ లేకుండానే బైక్ లపై రయ్ రయ్ అంటూ వీధుల్లో చక్కర్లు కొట్టడం ప్రమాదాలు కొని తెచ్చుకోవడం అలవాటుగా మారింది. దీంతో అనేక సార్లు హెల్మెట్ లేకుండా పట్టుపడిన వారు లక్షల్లో ఉన్నారు. ఈసారి నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తూ హైద్రాబాద్ పోలీసులు నిబంధనలు పట్టారు . హెల్మెట్ లేకపోతె కేసు పెడతామని హెచ్చరికలు జారీచేశారు.

వాహనదారులు హెల్మెట్ నిబంధనను లైట్ గా తీసుకుంటుండడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఇప్పటి వరకు హెల్మెట్ ధారణ ప్రాధాన్యంపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని.. అయినా మారకపోతే వారిని దారికి తీసుకు వచ్చేందుకు కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

ద్విచక్ర వాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించేందుకు అనుమతి ఉండదన్నారు. ఈ ఏడాది ఇప్పటికి హెల్మెట్ లేని వాహనదారులపై 11,54,463 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ మధ్య ప్రత్యేక తనిఖీ కార్యక్రమం చేపట్టిన పోలీసులు 27,306 కేసులను నమోదు చేశారు.

‘‘వెనుక ప్రయాణిస్తున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించేలా చూడడం వాహనదారుడిపై ఉన్న బాధ్యత. వాహనం నడిపే వారితో పోలిస్తే వెనుక కూర్చున్న వారికి ప్రమాదాల్లో ఎక్కువ అపాయం ఉంటోంది’’ అని సిటీ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఎన్నో ప్రమాదాల్లో హెల్మెట్ ధరించిన వాహనదారుడు సురక్షితంగా బయటపడగా.. హెల్మెట్ లేక వెనుకనున్న వారు మరణించినట్టు పేర్కొన్నారు.

హెల్మెట్ లేకపోతే వాహనదారుడితోపాటు, వెనుక కూర్చున్న వారికి కూడా విడివిడిగా చలాన్లు విధించనున్నట్టు ట్రాఫిక్ విభాగం డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు. వాహనంపై చిన్నపిల్లలను తీసుకెళుతుంటే వారికి సైతం హెల్మెట్ పెట్టాల్సిందిగా సూచించారు.

Related posts

ఎవడ్రా నీకు మరదలు … వ్యవసాయ శాఖ మంత్రిపై షర్మిల ఘాటు విమర్శలు…

Drukpadam

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు:ఈటలకు డిప్యూటీ సీఎం… టీఆర్ యస్ ఆఫర్ చేసిందంటూ కథనాలు …

Drukpadam

ఇంత ఘోరమా… నా రక్తం మరిగిపోతోంది: రేవంత్ రెడ్డి!

Drukpadam

Leave a Comment