Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేటీఆర్ నాస్తికుడు ముందు ఆయ‌న‌ను మార్చండి : బండి సంజ‌య్!

కేటీఆర్ నాస్తికుడు.. ముందు ఆయ‌న‌ను మార్చు కేసీఆర్: బండి సంజ‌య్!

  • తాను గొప్ప హిందువున‌ని కేసీఆర్ చెప్పుకుంటారు  
  • రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్వార్థంతో యాగాలు చేస్తుండొచ్చు
  • కానీ, రాష్ట్రంలోని మంత్రులంద‌రూ నాస్తికులే
  • వారంతా హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నారన్న సంజయ్ 

హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని బీజేపీ తెలంగాణ‌ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బీజేపీ నేత‌లు నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్, బీజేపీ నేత‌లు రాజాసింగ్, విజ‌య‌శాంతి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

‘తాను గొప్ప హిందువున‌ని కేసీఆర్ చెప్పుకుంటున్నారు. ఈ భ‌యంక‌ర హిందువు త‌న‌యుడు కేసీఆర్ ఒక నాస్తికుడు. ముందు నీ కొడుకును భ‌క్తుడిగా మార్చు కేసీఆర్. రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్వార్థంతో యాగాలు చేస్తుండొచ్చు. రాష్ట్రంలోని మంత్రులంద‌రూ కూడా నాస్తికులే. అందుకే తెలంగాణ స‌మాజంలో హిందూ దేవుళ్ల‌కి అవ‌మానం జ‌రుగుతోంది.

హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే ఇటువంటి చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌లు అడ్డుకోవాల్సిందే. కాబ‌ట్టి ద‌య‌చేసి మిత్రులారా ఓ మంచి ఆలోచ‌న‌తో ముందుకు వెళ్దాం. శ‌క్తిమంత‌మైన‌, ప్ర‌జాస్వామ్య విలువ‌లు ఉన్న తెలంగాణ‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందాం. వాజ్ పేయీ అడుగుజాడ‌ల్లో అంద‌రూ న‌డుద్దాం’ అని బండి సంజ‌య్ పిలుపునిచ్చారు.

Related posts

కర్ణాటకకు మీరు ఏం చేశారో.. ఏం చేస్తారో చెప్పండి..మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్!

Drukpadam

కేంద్ర బడ్జెట్ పై వెరైటీగా స్పందించిన చంద్రబాబు ….

Drukpadam

కేటీఆర్ కారుపై చెప్పు విసిరే య‌త్నం… రైతు సంఘం నేత అరెస్ట్‌!

Drukpadam

Leave a Comment