Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు!

న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు!

  • జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు
  • వేడుకల సందర్భంగా భౌతికదూరం పాటించాలి
  • మాస్క్ లేకపోతే కఠిన చర్యలు
కొత్త సంవత్సర వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వేడుకలు నిర్వహించుకునే ప్రదేశంలో భౌతికదూరం పాటించాలని ఆదేశించింది. మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈరోజు నుంచే ఆంక్షలు అమల్లోకి వస్తాయని చెప్పింది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts

నిరుద్యోగులకు కేసీఆర్ తీపి కబురు … 50 వేల ఉద్యోగాల నియామకాలు!

Drukpadam

జీవో నెం.1పై సుప్రీం ఏపీ సర్కార్కు ఎదురు దెబ్బ …చెంప పెట్టు అన్న చంద్రబాబు …

Drukpadam

Drukpadam

Leave a Comment