Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తీన్మార్ మల్లన్న చర్యలు గర్హనీయం …హిమాన్షు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడటం దుర్మార్గం:మంత్రి పువ్వాడ!

తీన్మార్ మల్లన్న చర్యలు గర్హనీయం …హిమాన్షు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడటం దుర్మార్గం:మంత్రి పువ్వాడ!
-సోషల్ మీడియా పేరుతొ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కార్యకర్తలు ఊరుకోరు
-చిల్లరమల్లర వ్యక్తులను బీజేపీ ఎలా చేర్చుకుంటుందని ప్రశ్నించారు
-కేటీఆర్‌ మనోభావాలు దెబ్బతిన్నాయి
-తామంతా కేటీఆర్ కు మద్దతుగా ఉంటాం

తీన్మార్ మల్లన్న చర్యలు గర్హనీయం …హిమాన్షు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడటం దుర్మార్గమని రాష్ట్ర రహణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు . సోషల్ మీడియా పెడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యవరిస్తే టీఆర్ యస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్ చర్యలకు పాల్పడుతుంటారని అలంటి వ్యక్తిని బీజేపీ ఎలా చేర్చుకుందని అన్నారు . చిల్లర వ్యక్తులను చేర్చుకోవడం ద్వారా బీజేపీ క్రెడిబులిటీ దెబ్బతినడం ఖాయమని మంత్రి అభిప్రాయపడ్డారు . తన కుమారుడి బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడినందున కేటీఆర్ మనోభావాలు దెబ్బతిన్నాయని అందువల్ల తామంతా కేటీఆర్ కు అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు .

మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా రవాణా శాఖ మంత్రి అజయ్ నిలిచారు. చిన్నపిల్లలను కించ పరిచే విధంగా బీజేపీ నేత తీన్మార్ మల్లన్న పోస్టులు పెట్టడం దారుణన్నారు. హిమాన్షు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడటం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్ పెట్టింది కాక మళ్ళీ తన ట్విట్టర్ హ్యాక్ అయిందని చెపుతున్నాడని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్నాము కదా అని సంయమనం పాటిస్తున్నామన్నారు. తమ కార్యకర్తలు ఆవేశంలో ఏదైనా చేస్తే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల గురించి తాము మాట్లాడలేకనా అని ఆయన నిలదీశారు.

కేటీఆర్ మనోభావాలు దెబ్బతిన్న కారణంగా మంత్రి కేటీఆర్‌కు తామంతా అండగా ఉంటామన్నారు. కేటీఆర్ సేవలు రాష్టానికి ఎంతో అవసరన్నారు. తీన్మార్ మల్లన్న తీరును ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. చిల్లరమల్లర వ్యక్తులను బీజేపీ పార్టీ ఎలా చేర్చుకుంటుందని ఆయన ప్రశ్నించారు.

Related posts

మా ప్రభుత్వం వస్తే వదిలే ప్రసక్తే లేదు: పోలీసులకు యరపతినేని వార్నింగ్!

Drukpadam

భట్టి పీపుల్స్ మార్చ్ ఖమ్మం నగరంలోకి గ్రాండ్ ఎంట్రీ …ప్రజల బ్రహ్మరథం…

Drukpadam

రాహుల్ గాంధీ వర్చువల్ ర్యాలీకి ఆదరణ.. లైవ్ ద్వారా 11 లక్షల మంది వీక్షణ!

Drukpadam

Leave a Comment