Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

నకిలీ నోట్లను మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన గుంటూరు అర్బన్ పోలీసులు!

నకిలీ నోట్లను మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన అర్బన్ పోలీసులు!
నకిలీ నోట్లను కేసులో 7 గురు నిందుతులను అరెస్ట్ చేశాం…ఎస్పీ అరిఫ్ హాఫిజ్
నిందితుల వద్ద నుంచి 45,05,500 నకిలీ కరెన్సీ నీ పట్టు కున్నాం.. ఎస్పీ అరిఫ్ హాఫిజ్

ఎంత నిఘా ఉన్న అక్రమార్కులు తమ అక్రమాలు ఆపడంలేదు … నకిలు నోట్ల చలామణి గురించి చాలాసార్లు వింటున్నాం … వాటిని పట్టుకున్న సందర్భాలు అనేకం అయినప్పటికీ వాటి చలామణి అవుతూనే ఉంది. గుంటూరు జిల్లాలో నకిలీ నోట్ల తయారీ కేంద్రంపై పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. వారినుంచి నకిలీ నోట్లు తయారీకి ఉపయోగించే మిషన్ , పేపర్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ఎస్పీ అరిఫ్ హాఫిజ్ తెలిపిన వివరాల ప్రకారం …. నిందితుల మద్య అసలు నోటు కి నాలుగు రెట్లు అధికంగా నకిలీ కరెన్సీ ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది…

నిందితుడు జంగం శ్రీనివాస్ రావు నకిలీ నోట్లను తయారు చేయడం లో దిట్ట గతంలో ఇతని పై కేసులు ఉన్నాయి. అయినా అతను తన బుద్ది మార్చుకోలేదు …దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు .ఇంటివద్దనే రహస్యంగా మిషన్ ఏర్పాటు చేసుకొని నోట్లు ప్రింట్ చేస్తూ వాటిని చలామణి చేస్తున్నాడు .అసలునోట్ల లక్ష ఇస్తే నాలుగు లక్షలు నకిలీవి ఇవ్వడం అందుకు పెద్ద గ్యాంగ్ ఉంది. వారి కార్లలో వివిధ ప్రాంతాలకు తిరుగుతూ అమాయకులను టార్గెట్ చేసి వాటిని మార్చడం చేస్తుంటారు .

నిందితుల వద్ద నుంచి నకిలీ కరెన్సీ తోబాటు.వాటి తయారీ కి స్కానర్.ప్రింటర్, జిరాక్స్ మిషన్ రెండు కార్లు స్వాధీనం చేసుకున్నాము.. నిందుతులు 6గురు గుంటూరు జిల్లా వాసులు కాగా ఒకరు ప్రకాశం జిల్లా వాసి .. వారు ప్రింట్ చేసే నోట్లలో అధికంగా 500 ,2000 వేల నోట్లు ఉండటం గమనార్హం . మిషన్లతో పాటు 40 లక్షల నకిలీ నోట్లు , పట్టుకున్నారు. నకిలీ నోట్లు కూడా అచ్చం నోట్లలాగా ఉన్నాయి. వాటిని మాములుగా గుర్తు పట్టడం కష్టంగా ఉంటుంది.

Related posts

హైదరాబాద్‌కు అంబులెన్స్.. దారిచ్చే క్రమంలో ఏడుకార్లు ఢీ!

Drukpadam

పది రోజుల్లో 12 మంది తలలు ఖండించిన సౌదీ అరేబియా!

Drukpadam

నా భర్త ఎలాంటివాడో నాకు తెలుసు… అవన్నీ తప్పుడు ఆరోపణలు: యాంకర్ శ్యామల

Drukpadam

Leave a Comment