Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఒడిదొడుకులు ఎదురైనా అంతిమ విజయం కమ్యూనిస్టులదే :పువ్వాడ!

ఒడిదొడుకులు ఎదురైనా అంతిమ విజయం కమ్యూనిస్టులదే :పువ్వాడ!
ప్రజాసమస్యలకోసం పోరాడేవారే కమ్యూనిస్టులు
మొక్కవోని దీక్షతో పోరాడాలి
వ్యవసాయాన్ని ప్రవేట్ పరం చేసే కుట్ర కేంద్రంపై ధ్వజం
దేశాన్ని ప్రవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్ర జరుగుతుంది
భూమి , భుక్తి , విముక్తి కోసం కమ్యూనిస్టులు పోరాటాలు శ్లాఘనీయం
ఖమ్మం లో సిపిఐ 97 ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్న సీనియర్ నేత పువ్వాడ

భారత కమ్యూనిస్టు పార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో ఆదివారం జరిగిన బహిరంగసభలో సీపిఐ సీనియర్ జాతీయ నాయకులు, మాజీ శాసనసభ, శాసనమండలి సభ్యులు శ్రీ పువ్వాడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. కమ్యూనిస్ట్ ఉద్యమచరిత్ర ఇప్పటితరం యువత తెలుసుకోవాలని అన్నారు . భూమి ,భుక్తి ,విముక్తి కోసం , నీబాంచెన్ దొరా …నీ కాళ్ళు మొక్కుతా అనే సమాజం నుంచి మనిషిని మనిషిగా చూసే సమాజం వైపు ప్రజలను నడిపించిన ఘనచరిత్ర కమ్యూనిస్టులదని పువ్వాడ అన్నారు. దున్నే వాడికి భూమికావాలని ,కూలి రేట్లు పెరగాలని రైతులకు గిట్టు బాటు ధరలు కావాలని ,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని , పనిగంటలు తగ్గించాలని నినదించి ఉద్యమాలు నడిపి అనేక కష్టాలకోర్చి , జైళ్లపాలు అయింది కమ్యూనిస్టులేనని పువ్వాడ అన్నారు . కమ్యూనిస్టుల చరిత్ర శ్లాఘనీయమన్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు పూనుకుందని పువ్వాడ ఆరోపించారు. నిరంతరం పెట్టుబడి దారులు ప్రజా వ్యతిరేక పాలకులపై ప్రజాపోరాటాలకు పునరంకితం కావాలని శ్రేణులుకు పిలుపు నిచ్చారు.

కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానంలో ఒడి దొడికులు ఎదురైన అంతిమ విజయం మాత్రం కమ్యూనిస్టులదేనని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేవారే కమ్యూనిస్టులని కమ్యూనిస్టులదే అంతిమ విజయమని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాలపై తిరుగుబాటు తప్పదని పువ్వాడ హెచ్చరించారు. దేశ సంపదను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, జాతిని భ్రష్టుపట్టిస్తున్న బీజేపీకి చరమగీతం పాడాల్సిందేన్నారు. కేంద్రానికి ఉండాల్సిన స్వావలంబన లక్షణం బీజేపీ పుణ్యమా అని స్వాహాలంబనగా మారిపోయిందని ధ్వజమెత్తారు.

Related posts

కారు పార్టీకి కూసుకుంట్లనే …ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులందరూ ఒకే సామాజికవర్గం !

Drukpadam

మల్లి కెనడాలో ట్రూడోనే… మైనార్టీ ప్రభుత్వమే…2017 ఫలితాలు రిపీట్…

Drukpadam

కొత్త కేంద్ర మంత్రులకు ప్రధాని హితోపదేశం!

Drukpadam

Leave a Comment