Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆకలితో అలమటిస్తున్నాం ఆదుకోండి హెచ్.ఆర్ .సి ని వేడుకున్న ఆంధ్రభూమి ఉద్యోగులు

ఆకలితో అలమటిస్తున్నాం ఆదుకోండి
హెచ్.ఆర్.సిని వేడుకున్న
ఆంధ్రభూమి ఉద్యోగులు
ఏడాది కాలంగా యాజమాన్యం జీతాలు చెల్లించక పోవడంతో తమ కుటుంబాల ఆకలి తీర్చలేక పోతున్నాం…ఇంటి అద్దెలు, పిల్లల ఫీజుల కోసం పడరాని పాట్లు పడుతున్నాం…
ఆర్థిక కష్టాలు భరించలేక ఇప్పటికే నలుగురు తోటి ఉద్యోగులు ప్రాణం కోల్పోయారు….
కనీసం మీరైనా మాకు న్యాయం చేయండి సారూ…అంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టీస్ చంద్రయ్యను ఆంధ్రభూమి ఉద్యోగులు వేడుకున్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై శుక్రవారం నాడు ఆంధ్రభూమి దినపత్రిక ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో హెచ్.ఆర్.సీలో పిటిషన్ దాఖలు చేశారు. కోవిడ్ సాకుతో ఆంధ్రభూమి యాజమాన్యం ఏడాది కాలంగా ప్రచురణ నిలిపివేయడంతో పాటు ఉద్యోగులగు జీతాలు చెల్లించడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీరని అన్యాయానికి గురిచేస్తున్నారని వారు పిటిషన్ లో ఆవేదన వ్యక్తం చేశారు. చట్టపరంగా తమకు దక్కాల్సిన ప్రయోజనాలను యాజమాన్యం విస్మరిస్తుందని ఉద్యోగులు వాపోయారు. పత్రికను పునరుద్ధరించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో దానిని నమ్ముకొని జీవిస్తున్న వేలాది కుటుంబాలకు న్యాయం చేకూర్చాలని వారు వేడుకున్నారు.

ఆంధ్రభూమి ఉద్యోగుల సమస్యలపై హెచ్.ఆర్.సి ని కలిసిన అనంతరం మాట్లాడుతున్న TUWJ ప్రధానకార్యదర్శి విరావత్ అలీ

హెచ్.ఆర్.సిని ఆశ్రయించిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, రాష్ట్ర నాయకులు ఏ.రాజేష్, కె.రాములు, ఆంధ్రభూమి ఉద్యోగుల సంఘం కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్, నాయకులు విజయప్రసాద్, జె.ఎస్.ఎం.మూర్తి, కొండవీటి రవి, యం. స్వామినాథ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

యాజమాన్యానికి నోటీసు
ఉద్యోగుల న్యాయమైన పిటిషన్ పై మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టీస్ చంద్రయ్య స్పందించారు. ఆంధ్రభూమి యాజమాన్యానికి ఆయన నోటీసు జారీచేశారు.

Related posts

Microsoft Details Updates To The Bing Maps Web Control

Drukpadam

పులిచింత‌ల డ్యామ్ దగ్గర కొట్టక పోయిన గేటు…వృధాగా పోతున్న నీరు …

Drukpadam

ఐటీ అధికారులు మా ఉద్యోగులపై చేయి చేసుకున్నారు..ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

Drukpadam

Leave a Comment