Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ యస్ కు అగ్ని పరీక్ష…

ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ యస్ కు అగ్ని పరీక్ష…
-అధికార పార్టీ పై తీవ్ర వ్యతిరేకత
– చెమటోడుస్తున్న మంత్రులు,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,
– రహస్య నివేదికలు తెప్పించుకున్నటున్న కేటీఆర్
-ఆరా తీసుతున్న కేసీఆర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్ యస్ కు అగ్ని పరీక్షగా మారాయి .ఇప్పటికే దుబ్బాక ,గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలలో ఎదురు దెబ్బలు తిన్న టీఆర్ యస్ పట్టభద్రుల ఎన్నికలలో సత్తాచాటాలనే అభిప్రాయంతో ఉంది . ఈ ఎన్నిక పోటీచేస్తున్న అభ్యర్థులకు మధ్య కాకుండా కేసీఆర్ పాలనపై జరుగుతున్నా ఎన్నికలలా ఉన్నాయి ప్రచారం కూడా అదే స్థాయిలో జరుగుతుంది. కేవలం డిగ్రీ చదివిన వారుమాత్రమే ఓటువేసేందుకు అర్హులైనందున ఉద్యోగులు ,నిరుద్యోగుల ఓట్ల కీలకంగా మారాయి. అందువల్ల ఈ ఎన్నికలను అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ విధానాలు , అభ్యర్థుల ఎంపికలో ప్రజాదరణ గురించి ఆలోచించకపోవటంతో అధికార పార్టీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నది . అందువల్ల అధికార పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్సీ ఎన్నికలు అంత అనుకూలంగా ఉన్నట్లు కనిపించటం లేదనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. అందుకే చావో రేవో లాగా ఈ ఎన్నికలపై కేసీఆర్ కేంద్రీకరించారు. ప్రతి జిల్లాకు ఇంచార్జిలను నియమించి సమన్వయ భాద్యతలు అప్పగించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు మంత్రులు ,ఎమ్మెల్యేలు , ఎంపీలు ఎమ్మెల్సీలు సిన్సియర్ గా పని చేస్తున్నా అభ్యర్థుల గెలుపు అంత తేలికగా లేదనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ వైఫల్యాలతో పాటు అభ్యర్థుల ఎంపికలోనూ లోపాలు ఉన్నాయంటున్నారు పరిశీలకులు . ప్రభుత్వం చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక పెట్టుకోక పోవటం మైనస్ గా మారింది. ఉద్యోగులకు పీఆర్సీ ,నిరుద్యోగులకు ఉద్యోగాల విషయం అధికార అభ్యర్థులను వెంటాడుతుంది. ప్రభుత్వం ఇందుకు సంబందించిన లెక్కలు చెబుతున్న అవి ఇటు ఉద్యోగులను అటు నిరుద్యోగులను మెప్పించేవిగా లేవు. ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు సులువుగా లేదనే అభిప్రాయం ఆపార్టీ నాయకులూ కార్యకర్తలలో సైతం ఉంది .ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ పట్టభద్రుల స్థానానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి నే అధికార పార్టీ తిరిగి తన అభ్యర్థిగా బరిలో నిలిపింది. అసలే అధికార పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దానికి తోడు పల్లా రాజేశ్వరరెడ్డి పట్ల మరీ ఉంది. దీనితో జిల్లాలలో మంత్రులు మోయలేని భారాన్ని నెత్తికి ఎత్తుకున్నట్లుగా భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఎదో విధంగా అధిగమిద్దాం అనుకుంటే అభ్యర్థి పట్ల ఇంత వ్యతిరేకమా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉన్న రాజేశ్వరరెడ్డి పై వ్యతిరేక ప్రచారం సైతం తీవ్రంగా జరుగుతుంది.దీంతో అధికార పార్టీ నేతలు పాలుపోలేని స్థితిలో ఉన్నారు. దీనికి తోడు ఆయన బాడీ లాంగ్వేజ్ పైన కూడా చర్చ జరుగుతుంది. పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో ఎక్కడ సానుకూల వాతావరణం కనిపించటంలేదనే అభిప్రాయాలే ఉన్నాయి. ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాలలో శ్రమిస్తున్నా, ఫలితం కనిపించడంలేదని సమాచారం. ఉద్యోగులు, నిరుద్యోగులు , ఉపాద్యాయిలు , వ్యాపారులు ,సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అన్నిరకాల సెక్షన్ ల వారిలో ప్రభుత్వం పట్ల సానుకూలత కనిపించటం లేదనే అభిప్రాయాలే ఉన్నాయి . అందువల్ల అధికార అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవడం కష్టం అంటున్నారు . మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవకపోతే అధికార అభ్యర్థికి రెండవ ప్రాధాన్యత ఓట్ల రావడం కష్టం. అందువల్ల గెలుపు అనేది అంత సులువు కాదని పరిశీలకుల అభిప్రాయం. సోషల్ మీడియా లో కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యేకించి అభ్యర్థికి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. పల్లా రాజేశ్వరరెడ్డి కేసీఆర్ ను అడ్డం పెట్టుకొని ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కోట్లకు పడగలెత్తారని ,డీమ్డ్ యూనివర్సీఐటీ సంపాదించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏ నాడు శాసన మండలిలో ఉద్యోగుల తరుపున ,నిరుద్యోగుల తరుపున మాట్లడలేదనే విమర్శలు ఉన్నాయి. పై కొత్త జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యేతో గని ఎంపీ తో గానీ , మంత్రులతో సరైన సంబంధాలు లేవని టీఆర్ యస్ నాయకుల్లోనే ఉంది. ఇక హైద్రాబాద్ నుంచి పీవీ కుమార్తె వాణి దేవిని పోటీలో పెట్టారు . చివరి నిమిషం వరకు అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోకుండా ఆలశ్యం చేశారు. చివరలో వాణి దేవిని ప్రకటించటం తో అప్పటికే ప్రతిపక్షాల నుంచి పోటీచేసే అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. దీనితో ఆమె మీద వ్యక్తిగతంగా వ్యతేరేకత లేనప్పటికీ ప్రచారంలో వెనుకబడ్డారు. పీవీ మీద ప్రేమ ఉంటె గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇవ్వవచ్చుకదా ? అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అందువల్ల టీఆర్ యస్ ఇప్పటి వరకు ఎదుర్కున్న ఎన్నికలు వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది .దీనితో టీఆర్ యస్ కు ఎన్నిక చిన్నదే అయినా అగ్ని పరీక్షగా మారాయి.

 

 

 

Related posts

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు ఘాటు హెచ్చరిక …

Drukpadam

సిద్దరామయ్య గొడ్డు మాంసం గోల ….

Drukpadam

బండ్ల గణేశ్ పై మండిపడ్డ జీవిత..అదే స్థాయిలో బండ్ల గణేష్ ఫైర్!

Drukpadam

Leave a Comment