Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

స్ఫూర్తినిచ్చే రతన్ టాటా కొటేషన్లు కొన్ని…!

స్ఫూర్తినిచ్చే రతన్ టాటా కొటేషన్లు కొన్ని…!

  • జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు
  • అయినా టాటా గ్రూపు ను బలంగా నిలబెట్టారు
  • నాయకత్వ మార్పిడి లో సవాళ్లను అధిగమించారు

జండెష్ జీ టాటా మనువడిగా (నావల్ టాటా కుమారుడు) రతన్ టాటా.. టాటా గ్రూపును అత్యంత సమర్థంగా నడిపించి.. ఆ పగ్గాలను సమర్థుడైన చంద్రశేఖర్ కు అప్పగించారు. అయినా కానీ, ఆయన టాటా గ్రూపును వెనుకనుండి నడిపిస్తూనే ఉన్నారు. నాయకత్వ మార్పిడి విషయంలో సైరస్ మిస్త్రీతో వివాదం నెలకొన్నా, గట్టిగానే పోరాడి తాను చేసింది సరైనదేనని నిరూపించారు. తొలితరం పారిశ్రామికవేత్తగా ఆయన అనుభవ సారాన్ని ఆయన కొటేషన్లే చెబుతాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవిగో…

‘మనం జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఎత్తు పల్లాలన్నవి ఎంతో ముఖ్యమైనవి. ఎత్తుపల్లాలు లేకుండా తిన్నగా సాగిపోతే.. ఈసీజీలోనూ ఇలాగే ఉంటే మనం జీవించి లేనట్టే’

‘సరైన నిర్ణయాలు అనే దానిని నేను నమ్మను. నేను నిర్ణయాలు తీసుకుంటాను. వాటిని సరైన దారిలో నడిపిస్తాను’

‘వేగంగా నడవాలని నీవు అనుకుంటే ఒక్కడివే ఆ పని చేయి. కానీ, చాలా దూరం నడవాలనుకుంటే మాత్రం కలసి నడవాలి’

ప్రజలు నీ మీద వేసే రాళ్లు స్వీకరించు. వాటిని ఉపయోగించి ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించు’

‘ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. కానీ దానంతట అదే తుప్పు పడుతుంది. అలాగే, ఎవరూ ఒకరిని నాశనం చేయలేరు. సొంత మనస్తత్వమే అలా చేయగలదు’

‘నేను ఎవరినైనా బాధపెట్టి ఉండొచ్చు. కానీ, ఎలాంటి పరిస్థితిలోనైనా రాజీపడకుండా నా వంతు మెరుగ్గా పనిచేసిన వ్యక్తిగా నన్ను నేను చూడాలనుకుంటాను’

‘నేను ఎగరలేని రోజు విషాద దినమే నాకు’

‘సీరియస్ గా ఉండకుండా జీవితాన్ని ఉన్నదున్నట్టుగా ఆస్వాదించాలి’

ఇతరులను కాపీ కొట్టే వ్యక్తి కొంత వరకు విజయం సాధించొచ్చు.. కానీ, ఆ తర్వాత అతను మరింత విజయం సాధించలేడు’

Related posts

అనకొండకు అడుగు దూరంలో..

Drukpadam

జలగం వెంకట్రావు గుంభనం వెనక మర్మమేమిటి …?

Drukpadam

మోదీ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు, గుజరాత్ హైకోర్టుకు రాహుల్ గాంధీ..!

Drukpadam

Leave a Comment