సీయం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు ..
రైతుబంధు ఖతాల్లో జమా
అన్నదాతల్లో ఆనందం
యాసంగి కాలానికి సంబంధించిన రైతుబంధు ఖతాల్లో జమా అవుతుండటంతో అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి జమ చేసినందుకు ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల రైతులతో కలిసి తెరాస పార్టీ నాయకులు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అసలైన రైతు బంధువు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు, విత్తనాల కొరత ఉండేదిని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని జిల్లా రైతాంగానికి అందిస్తూ, అన్ని వేళలా అందుబాటులో ఉంటూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యకు తీసుకుంటున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు వీరు నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ భూక్య లక్ష్మణ్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ మందడపు సుధాకర్, సర్పంచ్ తేజవత్ రమేష్, వార్డ్ సభ్యులు లాలు, సైదులు, రైతులు రాజు, భద్రు, భూక్య లింగా, సర్వన్, భీమా తదితరులు ఉన్నారు.