Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మారిన ఖమ్మం రూపు రేఖలు …అభివృద్ధి పై మంత్రి పువ్వాడ ఫోకస్!

మారిన ఖమ్మం రూపు రేఖలుఅభివృద్ధి పై మంత్రి పువ్వాడ ఫోకస్!
అన్నింటా కొత్త ధనమేఖమ్మం ప్రజలకు మరిన్ని సేవలకోసం తపన
రోడ్లు ,పార్కులు ,డివైడర్లు ,బస్సు స్టాండ్ , టి హబ్,కేబుల్ బ్రిడ్జి
వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఖమ్మం నెంబర్ వన్
లక్ష మందికి ఉపాధి గ్రానైట్ పరిశ్రమ
షాపింగ్ మహల్స్జ్యూవెలరీ షాప్ వెల్లువ
వైద్య , విద్యారంగంలోనూ ప్రగతి
ఖమ్మం కు కార్పొరేట్ కల్చర్పెరిగిన ఉపాధి

ఖమ్మం రూపు రేఖలు మారాయి…తెలంగాణ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఖమ్మం నెంబర్ వన్ గా ఉందనడంలో అతిశేయోక్తి లేదు . నేడు మనకు కొత్త ఖమ్మం దర్శనమిస్తుంది….రోడ్లు వెడల్పు అయ్యాయి. కొత్త బస్సు స్టాండ్ , లకారం లేక్ , లేక్ పై కేబుల్ బ్రిడ్జి , వాకింగ్ పారడైస్ , ముస్తఫా నగర్ సుందరీకరణ , అగ్రహారం రైల్వే బ్రిడ్జి , ఎప్పటినుంచో వేధిస్తున్న గొల్లపాడు ఛానల్ ఆధునికీకరణ ,ఉద్యోగాలు కల్పించే ఐ టి హబ్ , పార్క్ ల సుందరీకరణ , ఓపెన్ జిమ్ ల ఏర్పాటు ప్రజలను ఆహ్లద పరుస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు …ఖమ్మం నుంచి ఎమ్మెల్యే గా గెలిచిన పువ్వాడ అజయ్ రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కటమే . గతంలో ఖమ్మం నుంచి గెలిచిన ఏ ఎమ్మెల్యే ఇంతవరకు మంత్రి కాలేదు . పువ్వాడ అజయ్ కు ఆ అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఆయన తన సొంత నియోజకవర్గ అభివృద్ధిపై పెట్టారు . అందుకు అనుగుణంగా ఖమ్మం అభివృద్ధి చెందింది.

అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. కిలోమీటర్ల దూరం విస్తరించింది. విస్తరణకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి అజయ్ నిర్విరామంగా కృషిచేస్తున్నారు. ఖమ్మం ను మరింత అభివృద్ధి చేయాలనే తపన పట్టుదల ఆయనలో కనిపిస్తుంది. సందు దొరికితే నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. ప్రజలను పలకరిస్తున్నారు. సమస్యలు తెలుసు కుంటున్నారు. అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందింస్తున్నారు . అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.

మొదటగా ఆయన రోడ్ల విస్తరణపై కేంద్రీకరించారు . ముందు చాలామంది ఆయన్ని తిట్టుకున్నారు. పనిలేక రోడ్లు వెడల్పు చేస్తున్నారని తమ ఇల్లు కూలగొడుతున్నారని కారాలు మిరియాలు నూరిన వారు ఇప్పుడు సైలంట్ అయ్యారు .అంతే కాదు రోడ్ వెడల్పు అయిన తరువాత తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి. మా ప్రాంతం మారిపోయిందని తమకు గతంలో కంటే ఇప్పుడు బాగుందని మంత్రిగారు తలుచుకోకుంటే మా ప్రాంతం రూపురేఖలు మారేవి కావని ప్రసంశలు కురిపిస్తున్నారు.

ఖమ్మం చుట్టుపక్కల ఉన్న గ్రానైట్ పరిశ్రమ లక్షమందికి పైగా ఉపాధి కల్పిస్తుంది. కరోనా వల్ల కొత్త వెనకపట్టు పట్టిన తిరిగి పుంజు కుంటుంది. గతంలో ఖమ్మం లో పెద్దగా షాపింగ్ మహల్స్ లేవు గత కొన్ని సంవత్సరాలుగా వెల్లువలా వస్తున్నాయి. మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా ఖమ్మం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. చెన్నై షాపింగ్ మహల్ , సౌత్ ఇండియా షాపింగ్ మహల్ , కె ఎల్ ఎం , కళానికేతన్ , లాంటి వస్త్ర దుకాణాలు , డీమార్ట్ , రిలయన్స్ , మోర్ ,విశాల్ లాంటి కార్పొరేట్ దిగ్గజాల షాప్ లు వచ్చాయి. గోల్డ్ షాపులలో జయ్ లూకాస్ ,ఖజానా , తనిష్క్ , మలబార్ , దీంతో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. పని చేయగలిగిన వాళ్లకు పనిలేదనే ముచ్చటలేదు . ఇంకా పనివాళ్ళు దొరక్క అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. అనేక షాప్ లముందు వర్కర్లు కావలెను అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఖమ్మం లో నివసించేవారు కాకుండా చుట్టుపక్కల గ్రామాలూ ,చిన్న చిన్న పట్టణాల నుంచి రోజు ఖమ్మం వచ్చి పనిచేసే వారి సంఖ్య లక్షకు పైగానే ఉంటుంది.

వైద్య,విద్యారంగాలలో ప్రగతి

ఖమ్మం వైద్య ,విద్య రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించింది. ఒకప్పుడు ప్రతిదానికి హైద్రాబాద్ పరుగెత్తే పరిస్థితి లేదు . అనేక హాస్పటల్స్ వేశాయి. చుట్టుపక్కల పట్టణాలనుంచి వైద్యం కోసం ఖమ్మం రావాల్సిందే . ఇక విద్యారంగంలో కూడా అదే పరిస్థితి , మెడికల్ , న్యాయశాస్త్రం , పీజీ లాంటి అనేక చదువులు ఇక్కడ ఉన్నాయి. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో హైద్రాబాద్ తరువాత ఖమ్మం లోనే డిమాండ్ ఉంది.

Related posts

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు ష‌ర్మిలపార్టీ దూరం- బట్ కండీష‌న్సస్ అప్లై!

Drukpadam

బ్యాంకు లాకర్ నిబంధనల్లో మార్పులు.. జనవరి ఒకటి నుంచే అమల్లోకి!

Drukpadam

రెండు వేరు వేరు కోర్ట్ తీర్పులు …..

Drukpadam

Leave a Comment