Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సోము వీర్రాజుకు ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: సీపీఐ నారాయణ!

సోము వీర్రాజుకు ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: సీపీఐ నారాయణ!
-సారాయి వీర్రాజు అనే పేరు సార్థకమవుతుంది
-జిన్నా టవర్ వద్ద వీర్రాజు పరువు వెతుక్కుంటున్నారు
-కాలికి వేసుకునే చెప్పులను నెత్తి మీద పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే క్వార్టర్ అందజేస్తామని చెప్పడంపై పెద్ద దుమారమే నడుస్తుంది. అయినప్పటికీ ఆయన తాను అన్న మాట సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆలా అనలేదని అంటూనే సామాన్యుడుడికి తక్కువరేట్లకు మద్యం అందిస్తామని చెప్పటం విద్ధరంగా ఉందని పలువురు ఆయన మాటలపై సైటైర్లు వేస్తున్నారు. ఇప్పటివరకు మతాలు,కులాల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తూవస్తున్న బీజేపీ మద్యాన్ని కూడా తనకు అనుకూలంగా వాడుకునేందుకు దారులు వెతుక్కోవడం పై బీజేపీ వైఖరిని ఎండగడుతున్నారు.

సోము వీర్రాజును సారాయి వీర్రాజు అని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ, సోము వీర్రాజుకు సారాయి వీర్రాజు అనే పేరు సార్థకమవుతుందని ఆయన అన్నారు. ఇక దాన్ని మార్చడం కుదరకపోవచ్చునని అన్నారు.

మద్యంపై వ్యాఖ్యల నేపథ్యంలో విజయవాడలో పరువు పోగొట్టుకున్న వీర్రాజు… గుంటూరు లోని జిన్నా టవర్ వద్ద తన పరువును వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పులపై కూడా జీఎస్టీని విధించడం దారుణమని మండిపడ్డారు. కాళ్లకు వేసుకునే చెప్పులను నెత్తిమీద పెట్టుకునే పరిస్థితిని బీజేపీ తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు.

 

నన్ను ‘సారాయి వీర్రాజు’ అంటున్న వారు ఏం తాగుతారో నాకు తెలుసు: సోము వీర్రాజు

Somu Veerraju replies to critics
ఏపీలో తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం క్వార్టర్ రూ.50కే అందిస్తామంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. పలువురు నేతలు సోము వీర్రాజును ‘సారాయి వీర్రాజు’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు.

తనను ‘సారాయి వీర్రాజు’ అంటున్న వారు ఏం తాగుతారో తనకు తెలుసని అన్నారు. “నాపై ట్వీట్ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజాము వరకు ఏం చేస్తారు?” అని ప్రశ్నించారు. తాను పేదవాడిని దృష్టిలో ఉంచుకునే మద్యం గురించి మాట్లాడానని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఏపీలోని ప్రతి సమస్యకు బీజేపీ వద్ద పరిష్కారం ఉందన్న కోణంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని వెల్లడించారు.

Related posts

వైసీపీ ఎన్నారై సభ్యుడు పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు!

Drukpadam

స్పీడ్ పెంచిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …మేము సైతం లో దూకుడు …

Drukpadam

అంగళ్ల ఘటనపై వైసీపీ ,టీడీపీ పరస్పర ఆరోపణలు ..

Ram Narayana

Leave a Comment