Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆత్మలతో మాట్లాడతానని ఇంటినుంచి వెళ్ళిపోయినా బాలిక…రెండు నెలలైనా ఆచూకీ శూన్యం!

ఆత్మలతో మాట్లాడతానని ఇంటినుంచి వెళ్ళిపోయినా బాలిక
రెండు నెలలైనా ఆచూకీ శూన్యం
-‘ఆత్మ’ల కోసం.. రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన 17 ఏళ్ల బాలిక..
-విస్తుపోయే విషయాలు వెల్లడించిన తల్లిదండ్రులు!
-‘షామనిజా’నికి ప్రభావితురాలైన బాలిక
-తననెవరూ అర్థం చేసుకోవడం లేదంటూ ఆవేదన
-కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

సైన్స్ అభివృద్ధి చెందిన నేటికాలంలో ఇంకా ఆత్మలు ఉన్నాయంటూ నమ్మే వాళ్ళ సంఖ్య అధికంగానే ఉంది …నమ్మటం వేరు కానీ వాటితో మాట్లాడతానని చెప్పి బెంగుళూరుకు చెందిన బాలిక ఇంటినుంచి వెళ్ళిపోయింది . రెండు నెలలు అయిన ఆమె ఆచూకీ కనిపించలేదు దీంతో ఆబాలిక తల్లి తండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు .
ఆత్మలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతారు. బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి అనుష్క మాత్రం ఆత్మలు ఉన్నాయనే నమ్మింది. అంతేకాదు, వాటితో మాట్లాడతానంటూ ఇల్లొదిలి వెళ్లిపోయింది. అలా వెళ్లిన ఆమె ఆచూకీ రెండు నెలలైనా ఇప్పటికీ కానరాలేదు. పోలీసులు కూడా ఆమె కోసం గాలిస్తున్నారు. అయినా ఫలితం శూన్యం. కుమార్తె కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు అర్చన, అభిషేక్ సామాజిక మాధ్యమాల్లో ఆమె వివరాలను షేర్ చేస్తూ ఎవరికైనా కనిపిస్తే సమాచారం అందించాలని కోరుతున్నారు.

ఆత్మలతో మాట్లాడేందుకని వెళ్లిపోయినట్టుగా భావిస్తున్న అనుష్క ‘షామనిజా’నికి ప్రభావితురాలై ఉంటుందని భావిస్తున్నారు. కంటికి కనిపించని వాటిపై నమ్మకం పెంచుకోవడాన్ని షామనిజం అంటారు. దీనికి ప్రభావితమైనవారు పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతున్నట్టు ప్రవర్తిస్తుంటారు. తమ కుమార్తె కూడా ఇలానే మాట్లాడేదని ఆమె తల్లి అర్చన తెలిపారు. ఇంట్లోంచి వెళ్లిపోయే ముందు రోజు కూడా ఆమె అలానే ప్రవర్తించిందని, తాము ఎంతగానో నచ్చజెప్పామని పేర్కొన్నారు. తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదంటూ తిరిగి తమపైనే పెద్దగా అరిచిందని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.

అక్టోబరు 31న అనుష్క రెండు జతల దుస్తులు, రూ. 2500 నగదుతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు తల్లిదండ్రులు తెలిపారు. 12వ తరగతి పాసైన తర్వాత అనుష్క షామనిజానికి ప్రభావితురాలైందని పేర్కొన్నారు. షామనిజం కోసం తాను ధ్యానం చేసుకుంటానని చెబితే, అదేదో ఇంట్లోనే చేసుకోవాలని కూడా చెప్పామని గుర్తు చేసుకున్నారు. సెప్టెంబరు నుంచే ఆమెలో మార్పు కనిపించిందని, దీంతో ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

పెండింగ్ కేసుల్లో జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలి…డీజీపీ మహేందర్ రెడ్డి…

Drukpadam

ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో కేసులో త‌దుప‌రి చ‌ర్య‌ల నిలిపివేత‌!

Drukpadam

రేపటినుంచి లింగమంతుల జాతర … సూర్యాపేట వద్ద ట్రాఫిక్ ఆంక్షలు …

Drukpadam

Leave a Comment