Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న దుష్ట రాజకీయ శక్తులు: ఏపీ సీఎం జగన్!

అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న దుష్ట రాజకీయ శక్తులు: ఏపీ సీఎం జగన్!
-అయిన ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతున్నాం
-దుష్టశక్తులు మంచి బుద్ది ప్రసాదించాలని భగవంతుణ్ణి కురుకుంటున్నా
-ఏపీలో రూ.2,250 నుంచి రూ.2,500కి పింఛన్ల పెంపు
-కోటాలు , కోతలూ లేని పెన్షన్ ఇస్తున్నాం
-గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రారంభించిన సీఎం
-రూ.3 వేల దాకా పెంచుతామని ప్రకటన
-పెంపుతో నెలకు ప్రభుత్వం ఖర్చు రూ.1,570 కోట్లు
-రెండేళ్లలో 18.44 లక్షల కొత్త పింఛన్లు ఇచ్చామన్న సీఎం

తాము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటే కొన్ని దుష్ట రాజకీయశక్తులు అడుగడుగునా అడ్డుకుంటున్నాయని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాదైనా ఆదుష్టశక్తులకు మంచి బుద్ది ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు .

వితంతువులు, వృద్ధులు, హెచ్ఐవీ పేషెంట్లు, నేతన్నలు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, చర్మకారులకు ఇచ్చే సామాజిక పింఛన్లను ఏపీ ప్రభుత్వం పెంచింది. ఇప్పటిదాకా నెలకు రూ.2,250 ఇస్తుండగా.. నూతన సంవత్సర కానుకగా ఇవాళ్లి నుంచి రూ.2,500కు పెంచింది. ఈ పెంపుతో ప్రభుత్వం నెలకు పెన్షన్లపై రూ.1,570 కోట్లు ఖర్చు చేయనుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో పింఛన్ల పెంపును ఏపీ సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎవరెన్ని ఆటంకాలు కల్పించిన కోర్టులకు వెళ్లి స్టే లు తెచ్చిన తాత్కాలికమేనని అన్నారు . చివరకు పేదలకు తక్కువరేటు తో దొరికే ఎంటర్టైన్మెంట్ ను కూడా రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు .

మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్నీ నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంతో ప్రతి నెలా 62 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. కిడ్నీ, గుండె, లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకున్న పేషెంట్లకూ పింఛన్ ఇస్తున్నామని, దేశంలోనే అధిక మొత్తంలో పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని జగన్ అన్నారు.

పింఛన్ పెంపు ఇక్కడితో ఆగదని, రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతామని అన్నారు. రెండేళ్లలో 18.44 లక్షల కొత్త పింఛన్లు ఇచ్చినట్టు చెప్పారు. ఎవరైనా మంచి పాలన కోసం ఆరాటపడతారని, వారందరి ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు.

మంచి చేస్తుంటే ఆ మంచిని విమర్శించే వారు చాలా మంది ఉన్నారని అన్నారు. ఇవాళ కేవలం క్యాలెండర్ మాత్రమే మారడం లేదని, ఈ ఒకటో తారీఖు నుంచి ప్రతి పేదల మొహాల్లో చిరునవ్వులు రాబోతున్నాయన్నారు. ఆర్థిక ఆధారం లేక చాలా కులవృత్తులవాళ్లు అల్లాడిపోతున్నారని, వారందరికీ ఆర్థిక అండ అందిస్తున్నామని జగన్ అన్నారు.

ఎన్నికలకు రెండు నెలల ముందు గత ప్రభుత్వం దిగిపోయే నాటికి పింఛనును నెలకు కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇచ్చేవారని, కానీ తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణం పెన్షన్ ను రూ.2,250కి పెంచే ఫైల్ మీద సంతకం చేశానని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం కేవలం 39 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా పెన్షన్లలో కోటాలు లేవని, కోతలూ లేవని అన్నారు. కులం, మతం అని చూడకుండా అన్ని వర్గాల వారికీ పెన్షన్లను ఇస్తున్నట్టు చెప్పారు.

ఆర్థిక ఇబ్బందులున్నా, కరోనా కష్టాలు వెంటాడినా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రూ.45 వేల కోట్లను పెన్షన్ల కోసం ఖర్చు చేశామన్నారు. పింఛన్లు అందుకోవడంలో ఎవరికైనా ఇబ్బందులుంటే.. వెంటనే గ్రామ/వార్డు సచివాలయాలు లేదా వాలంటీర్లను సంప్రదించాల్సిందిగా జగన్ సూచించారు. వారే దగ్గరుండి పింఛన్ అందే విధంగా సాయం చేస్తారన్నారు. అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ 1902కు ఫోన్ చేసి సాయం పొందవచ్చన్నారు.

Related posts

మమ్మల్ని బెదిరిస్తావా.. మేం నీ అబ్బలాంటోళ్లం!: కేంద్రమంత్రిపై శివసేన ఎంపీ ఫైర్!

Drukpadam

మూడేళ్లు చేసిన జగన్ కే అంతుంటే 14 ఏళ్లు చేసిన నాకెంత ఉండాలి?: చంద్రబాబు

Drukpadam

కేసీఆర్ సొంత పొలంలో పండిస్తున్న వరి ధాన్యాన్ని ఏ ఐకేపీ సెంటర్ లో అమ్మారు? రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment