Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఈ లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేయించండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన!

ఈ లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేయించండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన!
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
20 వేలు దాటిన రోజువారీ కేసులు
ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
హిమాచల్ ప్రదేశ్ రికార్డు బ్రేక్ …18 సంవత్సరాలు నిండిన అందరికి టీకాలు

ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజు వారీ కేసులు 20 వేలను దాటేశాయి. డెల్టా వేరియంట్ కు తోడు ఒమిక్రాన్ వేరియంట్ కూడా పంజా విసురుతోంది. రాబోయే రోజుల్లో కరోనా కేసుల తీవ్రత బీభత్సంగా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన, రుచి కోల్పోవడం, అలసట, విరేచనాలతో బాధపడుతుంటే కనుక వారికి కరోనా సోకినట్టు భావించాలని… వారికి వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించాలని సూచించింది. ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు కూడా సూచించింది. ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది.

హిమాచల్ ప్రదేశ్ రికార్డు బ్రేక్ …18 సంవత్సరాలు నిండిన అందరికి టీకాలు

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన జనాభాలో 90 శాతం మందికి కరోనా రక్షక టీకాలు ఇవ్వడం పూర్తయింది. 2021 డిసెంబర్ 31 రాత్రి 7 గంటల వరకు టీకాల సమాచారాన్ని సర్కారు విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే తన వయోజన జనాభా మొత్తానికి రెండు డోసుల లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. అతి తక్కువగా పంజాబ్ రాష్ట్రంలో 40 శాతం మందికే రెండు డోసులు ఇచ్చారు. తెలంగాణ నూరు శాతం ఒక్కడోసు లక్ష్యాన్ని సాధించింది.

145 కోట్ల టీకాలను ప్రజలకు ఇవ్వగా.. రాష్ట్రాల వద్ద శుక్రవారం నాటికి 16.9 కోట్ల టీకా డోసులు మిగిలి ఉన్నాయి. సిరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ టీకా 128.9 కోట్ల డోసులను సరఫరా చేసింది. కోవాగ్జిన్ 15.7 కోట్ల టీకా డోసులను అందించింది. మిగిలినవి స్పుత్నిక్ టీకాలు.

ఈ నెల 3 నుంచి 12 ఏళ్లు నిండిన పిల్లలకు కూడా టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్, క్యాడిలాకు చెందిన జైకోవ్ డీ, సిరమ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన కోవోవ్యాక్స్ లకు ప్రభుత్వం అనుమతించింది. ముందుగా భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాలే చిన్నారులకు అందుబాటులోకి రానున్నాయి. వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న వారికి త్వరలో మూడో టీకా డోసు (బూస్టర్ డోసు) కూడా రానుంది.

Related posts

కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వాల అసంతృప్తి…

Drukpadam

బంగారంతో కరోనా మాస్కు… ధర మామూలుగా లేదు మరి!

Drukpadam

దుబాయ్ నుండి డిల్లీకి వచ్చిన పదిమందికి ఒమైక్రాన్…

Drukpadam

Leave a Comment