Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇమేజ్ సైజ్ తగ్గించుకునేందుకు క్రోమ్ లో చక్కని మార్గం!

ఇమేజ్ సైజ్ తగ్గించుకునేందుకు క్రోమ్ లో చక్కని మార్గం!
సైట్లలో అప్ లోడ్ కు కావాల్సిన మేర రీసైజ్
క్రోమ్ వెబ్ స్టోర్ ద్వారా టూల్ డౌన్ లోడ్
ఆఫ్ లైన్ లోనూ వినియోగించుకోవచ్చు

డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సిన సందర్భాల్లో ఇమేజ్ సైజ్ ఎక్కువగా ఉండడం ఇబ్బంది పెడుతుంటుంది. ఉద్యోగాలకు, పరీక్షల కోసం, ప్రవేశాలకు దరఖాస్తు సమయంలోనూ నిర్ణీత సైజుకు లోపున్న ఇమేజ్ నే అప్ లోడ్ చేయాలన్న షరతు కూడా ఉంటుంది. ఈ నిబంధన ఎందుకంటే.. పెద్ద సైజు ఇమేజ్ లతో ఆయా సైట్ల సర్వర్లపై ఎక్కవ లోడ్ పడుతుంది. అందుకనే ఈ పరిమితి విధిస్తుంటారు.

ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్ ఓ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఏ అవసరం కోసం అయినా మీ దగ్గరున్న ఫొటో సైజు తగ్గించుకోవాలంటే గూగుల్ క్రోమ్ ద్వారా దానిని చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు తగ్గించుకునేందుకు ఆన్ లైన్లో ఎన్నో వేదికలున్నాయి. వాటితో పోలిస్తే గూగుల్ అన్నది కొంచెం విశ్వసనీయమైన వేదిక.

పీసీలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన అనంతరం.. క్రోమ్ వెబ్ స్టోర్ కు వెళ్లాలి. లేదంటే నేరుగా https://chrome.google.com/webstore అడ్రస్ కు చేరుకోవచ్చు. అక్కడ రీసైజింగ్ యాప్ అని సెర్చ్ బార్ లో టైప్ చేయాలి. కనిపించే ఫలితాల్లో రీసైజింగ్ యాప్ ను ఎంపిక చేసుకోవాలి.

యాడ్ టు క్రోమ్ అని కుడివైపున ఉన్న బటన్ ను ప్రెస్ చేయాలి. దీంతో టూల్ డౌన్ లోడ్ అవుతుంది. ఎక్స్ టెన్షన్స్ సెక్షన్ లో ఇది కనిపిస్తుంది. ఐకాన్ పై టాప్ చేసి వినియోగించుకోవచ్చు. ఇంటర్నెట్ లేకపోయినా కానీ, ఆఫ్ లైన్ లోనూ ఈ టూల్ పనిచేస్తుంది.

ఎక్స్ టెన్షన్ ను సెలక్ట్ చేసిన తర్వాత వచ్చే పాపప్ విండోలో ప్లస్ అనే ఐకాన్ ను ప్రెస్ చేయాలి. ఫైల్ ఎక్స్ ప్లోరర్ సాయంతో కావాల్సిన ఇమేజ్ ను సెలక్ట్ చేసుకుని కింద బాక్స్ లో టాప్ చేసుకుని రీసైజ్ వివరాలు ఇవ్వాలి. ఎంత మేర తగ్గించాలన్నది సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇమేజ్ ను సేవ్ చేసుకుని వినియోగించుకోవచ్చు.

Related posts

కెనడాలో నెల రోజుల క్రితం ఏపీ విద్యార్థి మిస్సింగ్.. మిస్టరీగా మారిన కేసు!

Drukpadam

తైవాన్ ను కుదిపేసిన భారీ భూకంపం

Drukpadam

చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం ఛలో ఢిల్లీ!

Drukpadam

Leave a Comment