Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

15 నిమిషాల తేడాతో వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు!

15 నిమిషాల తేడాతో వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు!

  • అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘటన
  • డిసెంబరు 31 రాత్రి 11.45 గంటలకు బాబు, 12 గంటలకు పాప జననం
  • విషయాన్ని షేర్ చేసిన ఆసుపత్రి యాజమాన్యం

అవును.. వారిద్దరూ కవల పిల్లలే. 15 నిమిషాల తేడాతో వేర్వేరు తేదీల్లో, వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిందీ ఘటన. గ్రీన్‌ఫీల్డ్ సిటీకి చెందిన ఫాతిమా మాడ్రిగల్ పురిటినొప్పులతో డిసెంబరు 31న స్థానిక నటివిడాడ్ మెడికల్ సెంటర్‌లో చేరారు. ఆ రోజు రాత్రి 11.45 గంటల సమయంలో ఆమె బాబుకు జన్మనిచ్చింది.

ఆ తర్వాత 15 నిమిషాలకు అంటే 12 గంటలకు పాపకు జన్మనిచ్చింది. అంటే బాబు 31 డిసెంబరు 2021న జన్మిస్తే, పాప మాత్రం 1 జనవరి 2022న జన్మించినట్టు అయింది. ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం ఫేస్‌బుక్ ద్వారా పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది. కవలల తల్లి మాడ్రిగల్ మాట్లాడుతూ.. చాలా ఆనందంగా ఉందని, బాబుకు ఆల్ఫ్రెడో అని, పాపకు అలీన్ అని పేర్లు పెట్టినట్టు చెప్పారు.

Related posts

ప్రాథమిక స్వేచ్ఛను నమ్ముతాం: అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్​!

Drukpadam

పెన్షనర్లను పేదలుగా మార్చిన పీఆర్సీ

Drukpadam

లెఫ్ట్ అభ్యర్థి ఎలిమినేషన్ అనంతరం పల్లా ఆధిక్యం 25,209

Drukpadam

Leave a Comment