Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

యూపీ ఎన్నికల్లో కృష్ణుడి గోల …

యూపీ ఎన్నికల్లో కృష్ణుడి గోల …
ఎటాక్… కౌంటర్ ఎటాక్ …అఖేలేష్ …ఆదిత్యనాథ్ మధ్య దేవుళ్ళు
శ్రీకృష్ణుడు రోజూ నా కలలోకి వస్తాడు అధికారం మీదే అంటున్నాడు అఖిలేశ్ యాదవ్
శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి యోగిని మధుర నుంచి పోటీచేయమన్నారు…బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్
యోగి అన్నింట్లోనూ ఫెయిల్ అయ్యారు
ఆయన్ను ఎవరూ కాపాడలేరన్న ఎస్పీ చీఫ్

యూపీ ఎన్నికల్లో ఎస్పీ ,బీజేపీ మధ్య రసవత్తర మాటల యుద్ధం జరుగుతుంది….అధికారం మాదంటే …మాదేనని సవాళ్లు ప్రతిసవాళ్లతో ప్రచారం హోరెత్తుతోంది. ఇంతవరకు బాగానే ఉన్న మధ్యలో శ్రీకృష్ణుడిని తెచ్చారు . బీజేపీ రాజ్యసభ సభ్యుడు హరనాథ్ సింగ్ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాస్తూ శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మధుర నుంచి పోటీచేయమన్నాడని చెప్పటం సంచలంగా మారింది. దీనికి ఎస్పీ నేత అఖిలేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. శ్రీకృష్ణడు తనకు రోజు కలలోకి వస్తూ మీదే అధికారం అని చెబుతున్నాడని ఎటాక్ కు …కౌంటర్ ఎటాక్ చేశారు . దీనితో మీడియా సమావేశంలో నవ్వులు పూయించారు .అఖేలేష్ మాటలకూ అందరు పగలబడి నవ్వారు

శ్రీకృష్ణుడు ప్రతిరోజూ తన కలలోకి వస్తాడని, తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ చెబుతున్నాడని యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు తన కలలోకి వచ్చి యోగి ఆదిత్యనాథ్ ను మధుర నియోజకవర్గం నుంచి బరిలోకి దింపమన్నాడంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజ్యసభ సభ్యుడు హరనాథ్ సింగ్ రాసిన లేఖకు కౌంటర్ గా అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘బాబా (యోగి ఆదిత్యనాథ్) విఫలమయ్యారు. ఎవరూ ఆయన్ను కాపాడలేరు. ప్రతి రోజు రాత్రి కృష్ణుడు నా కలలోకి వస్తాడు. యూపీలో అధికారం మాదేనంటూ చెబుతున్నాడు’’ అన్నారు అఖిలేశ్. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. కాగా, ప్రస్తుతం అఖిలేశ్ యాదవ్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆజాంగఢ్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.

Related posts

శభాష్ కేసీఆర్ గారు.. మీ పాలన మహా అద్భుతం’ అంటూ ష‌ర్మిల చుర‌క‌లు…

Drukpadam

-కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదు …కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!

Drukpadam

పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ ప్రయాణమెటు …?

Drukpadam

Leave a Comment