Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

10 లక్షల కరెన్సీ నోటు విడుదల చేసిన చిన్నదేశం వెనిజులా…

10 లక్షల కరెన్సీ నోటు విడుదల చేసిన చిన్నదేశం వెనిజులా…
మన దేశం కరెన్సీ 1 రూపాయ అక్కడ 25 వేల 642 రూపాయలతో సమానం
ఒకప్పుడు సంపన్నదేశంగా ఉన్న వెనిజులా
భారీ చమురు నిల్వలు, బంగారుగనులతో తులతూగిన దేశం
విచక్షణ లేకుండా అప్పులు చేసిన ఫలితం
తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ
కూరగాయల కోసం సంచుల కొద్దీ డబ్బు తీసుకెళ్లాల్సిన స్థితి
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ దివాళా దిశగా ఉంది అనటానికి మంచి ఉదాహరణగా వెనిజులా నిలిచింది . ఒకప్పుడు సంచులకొద్దీ డబ్బు తీసుకొనిపోతే చేతుల్లో కూరగాయలు తీసుకుని రావాల్సి వస్తుందని అనేది నేడు నిజం అవుతుంది. స్వయం సంవృద్ధి లేక పొతే ఏ దేశమైన ఇదే పరిస్థితి వస్తుందని ప్రపంచ ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. దక్షిణ అమెరికా దేశం వెనిజులా ఒకప్పుడు భోగభాగ్యాలతో తులతూగింది. ప్రస్తుతం తీవ్ర దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతోంది . చమురు, బంగారం నిక్షేపాలతో సంపన్నదేశంగా విరాజిల్లిన దేశం ఇప్పుడు తీవ్ర అఘాధంలోకి నెట్టి వేయబడింది . హ్యూగో చావెజ్ అధికారం చేపట్టాక తీసుకున్న కొన్ని నిర్ణయాలు వెనిజులాను పతనం దిశగా నడిపించింది. చమురు నిల్వలు ఉన్నాయన్న ధీమాతో ఎడాపెడా అప్పులు చేసి దుర్భర దారిద్ర కోరల్లో చిక్కుకుంది. దాంతో ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నష్టనివారణ కోసమంటూ ఇష్టం వచ్చినట్టు కరెన్సీ నోట్లు ముద్రించారు. సమస్య పరిష్కారం కాలేదు సరికదా ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. అదే సమయంలో కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. కూరగాయలు కొనేందుకు కూడా సంచుల కొద్దీ డబ్బు తీసుకెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో వెనిజులా సర్కారు ఏకంగా 10 లక్షల బొలివర్ల విలువతో కరెన్సీ నోట్లు ముద్రించాలని నిర్ణయించింది. వెనిజులా కరెన్సీని బొలివర్ అంటారు. చమురు ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో ధనిక దేశంగా ఉన్న వెనిజులా ప్రజలకు అన్నీ ఉచితంగా అందించేంది. అందుకోసం విదేశాల నుంచి భారీగా రుణాలు తీసుకుని విచక్షణ లేకుండా ఖర్చు చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో వెనిజులాకు కష్టాలు మొదలయ్యాయి. అప్పుల భారం పెరిగిపోయింది. హ్యూగో చావెజ్ అనంతరం వచ్చిన నికొలాస్ మదురో ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. ఇప్పుడు 10 లక్షల విలువైన బొలివర్ నోటు విడుదల చేసినా పరిస్థితి మారుతుందన్న నమ్మకం లేదు.

ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే… వెనిజులా తీసుకువస్తున్న 1 మిలియన్ బొలివర్ నోటు విలువ భారత కరెన్సీలో 39 రూపాయలే!.అంటే భారత్ లో ఒక్క రూపాయ వెనిజులాలోని 25 వేల 641 బోలివర్ తో సమానం , దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఈ చిన్నదేశం ఎంత పెద్ద కష్టంలో పడిందో! ఒకప్పుడు ఆఫ్రికా దేశం జింబాబ్వే కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. తర్వాత కాలంలో కాస్త కోలుకున్నట్టు కనిపించినా కరోనా దెబ్బకు మళ్లీ చతికిలపడింది. మరి వెనిజులా ఏంచేస్తుందో చూడాలి!

Related posts

పీఆర్సీ పీట ముడి …మాట్లాడుకుందాం రండి …మీతో మాటల్లేవు!

Drukpadam

ఇమ్రాన్ ఖాన్ దిగిపోవాల్సిందేనని తేల్చి చెప్పిన పాక్ సైన్యం!

Drukpadam

మాట— మర్మం

Drukpadam

Leave a Comment