కరోనా విమానం ….179 మంది ప్రయాణికుల్లో 125 మందికి కరోనా !
ఒకే విమానంలో వచ్చిన 125 మందికి కరోనా పాజిటివ్
ఇటలీ నుంచి అమృత్ సర్ వచ్చిన విమానంలో కరోనా కలకలం
125 మందిని ఐసొలేషన్ కు పంపిన అధికారులు
అందరి శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిన వైనం
ఇటలీ నుంచి మాదేశంలోని అమృతసర్ వచ్చిన విమానం కరోనా విమానంగా మారిపోయింది. అందులో 179 ప్రయాణికులు దిగితే వారికీ అమృతసర్ ఎయిర్ పోర్ట్ లో పరీక్షలు నిర్వహించగా వారిలో 125 మందికి కరోనా నిర్దారణ అయింది. దీంతో విమానాశ్రయ అధికారులే బెంబేలు ఎత్తారు . ఇప్పటివరకు ఇంట పెద్ద మొత్తంలో కరోనా ప్రయాణికులు రాలేదు . ఒక్కసారిగా అధికారులు అంతా ఉలిక్కి పడ్డారు . పాజిటివ్ రాకపోయినా మిగతా 54 మంది ప్రయాణికులు కూడా వణికి పోతున్నారు. తమకు కూడా ఏమైనా సోకి ఉండవచ్చిననే అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. ఇటలీ నుంచి వచ్చిన విమానాన్ని కరోనా విమానం వచ్చిందనే అభిప్రాయం తో ఉన్నారు. వచ్చిన ప్రయాణికులకు ఓమిక్రాన్ నిర్దారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు.
దేశంలో కరోనా కేసులు మళ్లీ అమాంతం పెరుగుతున్నాయి. దీంతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా బెంబేలెత్తిస్తోంది. దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమయిందని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది. పరిస్థితి రోజురోజుకూ విషమిస్తున్న తరుణంలో మరో కలకలం రేగింది. ఇటలీ నుంచి పంజాబ్ లోని అమృత్ సర్ కు ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన 179 మందిలో 125 మందికి కరోనా నిర్ధారణ అయింది.
దీంతో వీరందరినీ ఐసొలేషన్ లో ఉంచారు. ఇదే సమయంలో వీరందరి శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. వీరిలో ఒమిక్రాన్ బాధితులు ఎంతమంది ఉన్నారనే విషయం జీనోమ్ సీక్వెన్సింగ్ లో తేలనుంది. రిస్క్, ఎట్-రిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్ కు పంపుతున్నారు.