Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

10 వేలు దాటిన పత్తి…జూలూరుపాడులో రూ.10,200…

10 వేలు దాటిన పత్తి…జూలూరుపాడులో రూ.10,200
-అన్ని మార్కెట్లలోనూ ధరల పరుగు
-ఖమ్మంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి దిగుబడులతో అభిషేకం
-మిన్నంటుతున్న ఊరురా రైతు బంధు సంబరాలు.
-మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో గ్రామ గ్రామన వేడుకలు.
-ముఖ్యమంత్రి కేసీఆర్ పై వివిధ రకాలుగా చూపుతున్న అభిమానం..
-చిత్రపటానికి పుష్పాభిషేకం, క్షీరాభిషేకం.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా రైతు బంధు వేడుకలు మిన్నంటుతున్నాయి.రైతులు వివిధ రకాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తమ అభిమానాన్ని చాటి చెపుతున్నారు. పుప్పభిషేకం, క్షీరాభిషేకం చేశారు. మిర్చి, పత్తి ని పేర్చి తమ అభిమానాన్ని చాటి చెప్తున్నారు.

AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, మంత్రి గారి PA CH.రవికిరణ్ ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నందు నాయకులు రైతులు, ప్రజల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముఖచిత్రాన్ని అపరాలతో పేర్చి జై కేసీఆర్.. జై తెలంగాణ అని పేర్చారు.మొన్న మిర్చి, నిన్న పత్తి సంబురాల తరహాలో నేడు అపరాల సాగు రైతుల సంబురాలు అంబురాన్ని అంటుతున్నాయి.

మక్క, కంది, పెసర పంటలతో రూపుదిద్దుకున్న ఈ తరహా సీఎం కేసీఆర్ గారి చిత్రపటం యావత్ దేశంలోనే తొలిసారి అని పేర్కొన్నారు.24 గంటల పాటు శ్రమించి 1000 అడుగుల విస్తీర్ణంలో రూపొందించిన అపరాల సాగు రైతుల రైతుబందు కృతజ్ఞతల వేడుకలు నూతన ఒరవడి సంతరించుకుందని వివరించారు.

గత కొన్నిరోజులుగా రికార్డులు సృష్టించిన పత్తి ధర బుధవారం రూ.10 వేలను దాటింది. అంతర్జాతీ య మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ పెరగడంతోపా టు వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తుండటం తో ధరలు పరుగులు తీస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు సబ్‌ మార్కెట్‌ యార్డులో క్వింటాల్‌ ధర ఏకంగా రూ. 10,200కు చేరింది. కనిష్ఠంగా రూ.9,500 ద క్కింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా ల్‌కు రూ.10 వేలు పలికింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.9,999 చెల్లించారు. వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో క్వింటాల్‌కు అత్యధికంగా రూ.9,705 పలికింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌ గరిష్ఠంగా రూ.9,801 దక్కింది. పత్తి ధర రూ.10 వేలు దాటడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం మార్కెట్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ చిత్రపటాలకు పత్తితో అభిషేకం చేశారు.

Related posts

ప్రకాశం జిల్లాలో ఎస్ ఐ ,రెవెన్యూ అధికారి ఫారెన్ టూర్ పై వివాదం ….?

Drukpadam

ఖమ్మం లో పోలీస్ స్వామ్యం…సీఎల్పీ నేత భట్టి

Drukpadam

రేపు భారత రాష్ట్రపతి ఎన్నిక… పోలింగ్ కు సర్వం సిద్ధం

Drukpadam

Leave a Comment