Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

20 రేట్ల ప్రతీకారం తీర్చుకుంటా …చంద్రబాబు

20 రేట్ల ప్రతీకారం తీర్చుకుంటా …చంద్రబాబు
నేను కుప్పం వదిలిపోతానని దుష్ప్రచారం చేస్తున్నారు
కుప్పంలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన
దేవరాజుపురంలో రోడ్ షో
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానన్న బాబు

ప్రతీకార రాజకీయాలు సరైనవి కావు …జగన్ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని నిత్యం చెప్పే టీడీపీ నాయకులూ ఇప్పడు చంద్రబాబు మాటలకూ ఏమి సమాధానం చెపుతారో చూడాలి …కుప్పం నియోజకవర్గ పర్యటనలో ఉన్న బాబు నియోజకవర్గ ప్రజలు పై పార్టీ నుంచి వెళ్లిన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలో పనిగా అధికార వైకాపాకి సహజంగానే విరుచుకపడ్డారు . తాను ఈసారి కుప్పం నుంచి పోటీ చేయనని ప్రచారం చేస్తున్నారు. ఇది నిజం కాదు తాను కుప్పాన్ని వదిలి ఎక్కడికి పోను అని కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు .

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వచ్చారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఆయన దేవరాజుపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పర్యటనకు వచ్చానని వెల్లడించారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటానని చెప్పారు.

తాను కుప్పం నియోజకవర్గాన్ని వదిలిపెడుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎప్పటికీ కుప్పం నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నేతలు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారని చంద్రబాబు కొనియాడారు. అధికార పార్టీ ఇబ్బందిపెడితే 20 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. కార్యకర్త ఒంటిపై పడే దెబ్బను నాకు తగిలిన దెబ్బగానే భావిస్తా అని పేర్కొన్నారు.

Related posts

ప్రత్యర్థులపై కక్ష్య సాధింపుకు వ్యవస్థలను వాడుకుంటే పతనం తప్పదు : మమతా

Drukpadam

కేంద్రం చేస్తే ఒప్పు :మేము చేస్తే తప్పా…? బీజేపీది దుష్ప్రచారం :సజ్జల…

Drukpadam

రఘురామ అరెస్ట్ పై భిన్న స్వరాలు…!

Drukpadam

Leave a Comment