వనమా రాఘవేందర్ ను సస్పెండ్ చేసిన టీఆర్ఎస్ పార్టీ…
–రాఘవ అరెస్ట్ పై కొనసాగుతున్న అనిశ్చితి
–పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్య
–ఎమ్మెల్యే వనమా తనయుడిపై తీవ్ర ఆరోపణలు
–తీవ్రంగా పరిగణించిన టీఆర్ఎస్ హైకమాండ్
–పరారీలోనే వనమా రాఘవేందర్
టీఆర్ యస్ రాష్ట్ర నాయకుడిగా చలామణి అవుతూ కుటుంబంలో నలుగురు ఆత్మహత్యలకు కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ ను పార్టీ నుంచి స్పస్పెన్షన్ చేస్తున్నట్లు టీఆర్ యస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధినేత ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి , ఖమ్మం జిల్లా పార్టీ ఇంచార్జి నూకల నరేష్ రెడ్డి లు ఈ విషయం వెల్లడించారు .ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సంఘటనే కాకుండా రాఘవపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత దశాబ్ద కాలంగా ఉన్న అనేక కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ లాంటి సంఘటనే గతంలో కూడా జరిగిన పట్టించుకోలేదని తండ్రి , ఎమ్మెల్యేగా , మంత్రిగా ఉండటంతో అనేక మంది అధికారులు వనమా కుమారుడైన రాఘవకు సరెండర్ కాకపోతే ఇబ్బందులు తప్పేవి కావని దీంతో రాఘవ ఆగడాలకు అంతులేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. మంత్రిగా వనమా వెంకటేశ్వరరావు ఉన్న మోత వ్యవహారాలు అన్ని కొడుకు రాఘ నడిపించారని ఆయన పెట్టమన్న దగ్గర సంతకం పెట్టడమే వనమా వెంకటేశ్వరరావు పనిగా ఉండేదని పలువురు పేర్కొంటున్నారు .
పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేందర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అతడిపై వచ్చిన ఆరోపణలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది.పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ సూచనమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్‌ఛార్జి నూకల నరేష్ రెడ్డిలు రాఘవ సస్పెన్షన్ విషయాన్నీ ధ్రువీకరించారు కుటుంబ ఆత్మహత్యకు కారణంగా ఆరోపణలకు గురైన కొత్తగూడెం పార్టీ నాయకులు వనమా రాఘవేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీసుకున్న నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని వారు తెలిపారు . కాగా, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడైన రాఘవేందర్ అరెస్ట్ పై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతోంది. అతడిని పోలీసులు నిన్న అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను పోలీసులు ఖండించడంతో రాఘవేందర్ ఆచూకీపై సస్పెన్స్ నెలకొంది. అసలు రాఘవ ఎక్కడ ఉన్నాడనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు .కొత్తగూడెం పోలీసులు నిన్న పెద్ద ఎత్తున ట్రోల్ అయిన అరెస్ట్ వార్తలను ఖండించారు . వనమా రాఘవ కోసం గాలింపు జరుపుతున్నామని పోలీస్ బృందాలు ఏర్పాటు చేశామని ఏసీపీ తెలిపారు .
పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. సూసైడ్ నోట్ తో పాటు, సెల్ఫీ వీడియోలోనూ వనమా రాఘవేందర్ ప్రస్తావన ఉండడంతో అతడిపై పాల్వంచ పీఎస్ లో కేసు నమోదైంది. కాగా, గతంలో ఓ ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య కేసులో వనమా రాఘవేందర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మధ్యాహ్నం లోగా లొంగిపోవాలంటూ స్పష్టం చేశారు. వనమా వెంకటేశ్వరరావు ఇంటికి కూడా నోటీసులు అంటించారు .