కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్‌లోనా.. ఫాంహౌస్‌లోనా?: రేవంత్ రెడ్డి
-అక్రమాలను ప్రశ్నిస్తే నిమిషాల్లో అరెస్టు చేస్తారు
-మానవ మృగాన్ని పట్టుకోలేకపోవడం ఏమిటి?
-దుర్మార్గుడిని కాపాడుతున్న అదృశ్య శక్తి ఏంటి?
-టీఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేంటి?
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇటీవల ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు వనమా రాఘవ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కీచక రాఘవ ఎక్కడ? అని ఆయన నిలదీశారు. రాఘవ ప్రస్తుతం ప్రగతి భవన్ లో ఉన్నాడా?.. ఫాంహౌస్ లో ఉన్నాడా? అంటూ ప్రశ్నించారు.
అక్రమాలను ప్రశ్నించే వారిని నిమిషాల్లో అరెస్టు చేసిన పోలీసులు మానవ మృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడం ఏమిటి? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. దుర్మార్గుడిని కాపాడుతున్న అదృశ్య శక్తి ఏంటని ప్రశ్నించారు. దారుణ ఘటన పై టీఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేంటని ఆయన నిలదీశారు.
కాగా, రాఘవను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై పలు పార్టీల నేతలు తెలంగాణ సర్కారుపై మండిపడుతున్నారు. రాజకీయ బలం ఉన్నంత మాత్రాన నిందితులు తప్పించుకునేందుకు అవకాశం ఇస్తారా? అని నిలదీస్తున్నారు.
ఖమ్మంలో రాఘవ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన సిపిఎం నాయకులు
“జనారణ్యంలో మానవ మృగం వనమా రాఘవ దిష్టిబొమ్మను ఖమ్మంలో సిపిఎం ఆధ్వర్యంలో తగలబెట్టారు .రామకృష్ణ కుటుంబం మరణానికి కారణమైన వనమా రాఘవను వనేతనే అరెస్ట్ చేయాలనీ , లేకపోతె పరిణామాలు తీరముగా ఉంటాయని హెచ్చరించారు. అనేక మరణాలకు , మానభంగాలు , దందాలకు , బెదిరింపులకు షటిల్ మెంట్లకు భూకబ్జాలకు కారణమైన వనమా రాఘవ ను కఠినంగా శైక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు , కళ్యాణం వెంకటేశ్వరరావు , యర్రా శ్రీనివాస్ రావు , మెరుగు సత్యనారాయణ , ఎం ఏ జబ్బార్ , విఠల్ , తాళ్లపల్లి కృష్ణ ,ప్రకాష్ , నాగేశ్వరరావు , సుదర్శన్ , నాగ సులోచన , అమరావతి తదితరులు పాల్గొన్నారు .