రాజకీయ వార్తలు

ప్రధాని మోదీ నటనలో నేచురల్ స్టార్ నానిని మించిపోతున్నారు: సీపీఐ నారాయణ!

ప్రధాని మోదీ నటనలో నేచురల్ స్టార్ నానిని మించిపోతున్నారు: సీపీఐ నారాయణ!

  • పంజాబ్ ఘటనపై నారాయణ స్పందన
  • మోదీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్య  
  • హత్యాయత్నం అంటూ కొత్తడ్రామా ప్రారంభించారని విమర్శలు  

ప్రధాని మోడీ నటనలో దిట్ట ని పంజాబ్ సంఘటనలో ఆయన నటన తీరు అద్భుతమని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ సెటైర్లు విసిరారు . నటనలో తెలుగు నాచురల్ స్టార్ గా చెపుతామని అంతకు మించి ప్రధాని నటిస్తున్నారని వ్యంగ్య బాణాలు వదిలారు . పంజాబ్ లో జరిగిన పరిణామాలు భారత్ ప్రధానికి జరిగిన భద్రతా లోపంపై కాకుండా రాజకీయంగా లబ్ది పొందాలని చూడటం సిగ్గుచేటన్నారు. ప్రధాని పర్యటనపై జరిగిన లోపాలపై ఖచ్చితంగా విచారణ జరగాలని ఎవరిలోపం ఏమిటో నిర్దారించాలని అందులో ఇలాంటి పొరపాటు ,రెండవమాతకు తావులేదని అన్నారు. దాన్ని సాకుగా చూపి వైరిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరించడం రాజకీయంగా దాడులు చేయడం తగదని అన్నారు.

పంజాబ్ లో రైతుల నిరసనను తనపై హత్యాయత్నంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సానుభూతి పొందేందుకు ఈ ఘటనను ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తీరు చూస్తుంటే నటనలో నేచురల్ స్టార్ నానిని మించిపోతున్నారని అన్నారు.

ఇటీవల ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో రైతుల సెగ చవిచూసిన సంగతి తెలిసిందే. ఫిరోజ్ పూర్ జిల్లాలో మోదీ కాన్వాయ్ ని రైతులు అడ్డగించడంతో, ఆయన ఓ ఫ్లైఓవర్ పై దాదాపు 20 నిమిషాల పాటు ఎటూ కదల్లేకపోయారు. చివరికి ఆయన కాన్వాయ్ వెనుదిరగాల్సి వచ్చింది.

ఇక, సీపీఐ నారాయణ ఇతర అంశాలపైనా స్పందించారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్ విధానం బాగుందని, ఇళ్ల రేటు పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ మంచి సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నా, పాలనాపరమైన వైఫల్యాలు చోటుచేసుకుంటున్నాయని నారాయణ పేర్కొన్నారు.

Related posts

మోడీకి మమతాబెనర్జీ గుడ్ సర్టిఫికెట్ …

Drukpadam

నన్ను, నా భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూశారు..ఎమ్మెల్యే పొన్నాడ!

Drukpadam

కడియం శ్రీహరితో వివాదానికి తెరపడింది: కేటీఆర్‌తో భేటీ తర్వాత రాజయ్య

Drukpadam