Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ కు జై కొట్టిన సోనూసూద్ ఫ్యామిలీ …

కాంగ్రెస్ కు జై కొట్టిన సోనూసూద్ ఫ్యామిలీ …
-కాంగ్రెస్ పార్టీలో చేరిన సోనూ సూద్ సోదరి మాళవిక
-రాజకీయ రంగప్రవేశం చేసిన సోనూ సూద్ సోదరి
-మోగాలో పంజాబ్ సీఎం సమక్షంలో పార్టీలో చేరిక
-మోగా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ
-మోగా… సోనూ సూద్ స్వస్థలం

ప్రముఖ సామజిక సేవ కార్యకర్తగా , నటుడిగా మంచి పేరున్న సోనూసూద్ ఫ్యామిలీ కాంగ్రెస్ కు జైకొట్టింది. దేశవ్యాపితంగా సోనూసూద్ అంటే తెలియనివారు లేరంటే అతిశేయోక్తి లేదు … ఆయన సోదరి మాళవిక రాజకీయాల్లో చేరేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఏ పార్టీలో అనేది కొన్నినెలలుగా సస్పెన్షన్ లో ఉంది . ఇప్పడు ఆమెను స్వయంగా సోనూసూద్ తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో సోనూసూద్ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ను కూడా కలిశారు . దీనితో సోనూసూద్ ఫ్యామిలీ ఎటువైపు అనేదానికి పోలిస్టాప్ పడింది. ….

ప్రముఖ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక సచార్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాళవిక రాజకీయ రంగప్రవేశంపై కొన్నాళ్లుగా వార్తలు వస్తుండడం తెలిసిందే. మాళవిక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తమ స్వస్థలం మోగా నుంచే ఆమె బరిలో దిగే అవకాశాలున్నాయి.

ఇవాళ మోగాలో జరిగిన ఓ కార్యక్రమంలో పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మోగాలో సోనూ సూద్ నివాసానికి వచ్చారు. సోనూ సూద్, మాళవికతో ఆయన చర్చలు జరిపారు.

కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల సోనూ సూద్ ను పంజాబ్ ఐకాన్ గా తొలగించడం తెలిసిందే. సోనూ సూద్ సోదరి రాజకీయాల్లోకి వస్తుండడంతో ఎస్ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే బాధ్యతను గతంలో సోనూ సూద్ కు అప్పగించింది. పంజాబ్ ఐకాన్ గా నియమించింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.

Related posts

కడప చేరుకున్న చంద్రబాబు.. పోటెత్తి వచ్చిన టీడీపీ శ్రేణులు

Drukpadam

ఇకపై ఏ పార్టీలో చేరను: యశ్వంత్ సిన్హా!

Drukpadam

మరో పాదయాత్ర చేపట్టనున్న రాహుల్ గాంధీ!

Drukpadam

Leave a Comment