Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

యూపీ ఎన్నికల్లో మాయావతి కూడా పోటీకి దూరం …

యూపీ ఎన్నికల్లో మాయావతి కూడా పోటీకి దూరం …
ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కీలక నిర్ణయం
మాయావతి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరని ప్రకటించిన బీఎస్పీ
తాను కూడా పోటీ చేయడం లేదన్న బీఎస్పీ ఎంపీ సతీశ్ చంద్ర
ఫిబ్రవరి 10 నుంచి అసెంబ్లీ ఎన్నికలు
మార్చి 10న కౌంటింగ్

ఐదు రాష్ట్రాల ఎన్నికల షడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో అందరిచూపు పెద్దరాష్ట్రమైన యుపిపై ఉంది. ఇక్కడ ప్రధానంగా ఎస్పీ ,బీజేపీ , బీఎస్పీ ,కాంగ్రెస్ లు తలపడుతున్నాయి. ఇందులో ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనేందుకు వీలుగా ఎస్పీ నేత అఖిలేష్ తాను పోటీచేయటంలేదని ప్రకటించారు. సీఎం యోగి అథిత్యనాధ్ పోటీపై ఇంకా బీజేపీ ఒక నిర్దారణకు లేదు .ప్రియాంక గాంధీ పోటీలో లేరు . ఇక తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా పోటీ చేయడంలేదని బీఎస్పీ అధికారికంగా ప్రకటించింది. కీలక నేతలు ప్రచారంలోనూ వ్యూహాలతో తీరిక లేకుండా ఉండటమే ఇందుకు కారణంగా ఉంది. అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి దీంతో ఎన్నికల వాతావరణం కరోనా నేపథ్యంలో ఎలా ఉండబోతుందో అనే ఆశక్తి నెలకొన్నది .

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా వెల్లడించారు. తాను కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. సమాజ్ వాదీ పార్టీకి 400 మంది అభ్యర్థులు లేనప్పుడు… 400 స్థానాల్లో వాళ్లు ఎలా పోటీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. యూపీలో బీజేపీ కానీ, సమాజ్ వాదీ పార్టీ కానీ అధికారంలోకి రాలేదని… బీఎస్పీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

ఇక, 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి జరగనున్నాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3 , 7 తేదీలలో ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న కౌంటింగ్ జరుగుతుంది. మరోవైపు, మాయావతి ఇంత వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని విషయం గమనార్హం.

Related posts

కేరళ కేబినెట్​ లోకి అంత కొత్తవారే … కె.కె.శైలజకు దక్కని చోటు!

Drukpadam

ఇండియాటుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే.. బెస్ట్ సీఎంగా యోగి.. టాప్ టెన్ లో కనిపించని జగన్, కేసీఆర్!

Drukpadam

వద్దిరాజు రాజ్యసభకు @ ఏడాది …ఇనగుర్తి నుంచి అత్యన్నతి సభకు..

Drukpadam

Leave a Comment