తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో వాన, ఈదురుగాలుల బీభత్సం!
-తెలంగాణలో అకాల వర్షాలు
-కరీంనగర్ లో కుప్పకూలిన 70 అడుగుల హోర్డింగ్
-రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ వర్షాలు
-నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్,జగిత్యాల ,నిజామాబాద్, పెద్దపల్లి వరంగల్ జిల్లాల్లో రాళ్ళవాన కురిసింది. కరీంనగర్ లో భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవగా, భారీ హోర్డింగ్ లు సైతం కుప్పకూలాయి. ఫిబ్రవరిలో నిర్వహించతలపెట్టిన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ప్రచారంలో భాగంగా గీతా భవన్ సెంటర్ లో రాముడి పట్టాభిషేకం భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. విద్యుద్దీప కాంతులతో వెలిగిపోయే ఈ 70 అడుగుల హోర్డింగ్ ఈదురుగాలుల తాకిడికి నేలకొరిగింది. అయితే, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
కరీంనగర్ జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. శంకరపట్నం, రామడుగు, చొప్పదండి, జమ్మికుంట, మానకొండూరు, పెద్దపల్లి ప్రాంతాల్లో అకాలవర్షంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ వర్షం, ఈదురుగాలులతో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
మిగతా ప్రాంతాలలో కూడా ఈదురు గళాలు ,వడగళ్ల వానకు అనేక పూరిగుడిశలు రేకుల షేడ్లు లేచిపోయాయి.దీనితో ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు. పట్టి ,మిరప ఇతర పంటలు దెబ్బతిన్నాయి.