Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రతి కార్యకర్త అభిప్రాయం తెలుసుకున్నాకే వచ్చే ఎన్నికల్లో పొత్తు నిర్ణయిస్తాం: పవన్ కల్యాణ్

ప్రతి కార్యకర్త అభిప్రాయం తెలుసుకున్నాకే వచ్చే ఎన్నికల్లో పొత్తు నిర్ణయిస్తాం: పవన్ కల్యాణ్
-కార్యనిర్వాహక సభ్యులతో పవన్ టెలీకాన్ఫరెన్స్
-జనసైనికులు అప్రమత్తంగా ఉండాలన్న పవన్
-వివిధ పార్టీలు పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని వెల్లడి
-జనసైనికులు ఒకేమాటపై ఉండాలని ఉద్బోధ

పార్టీలోని ప్రతికార్యకర్త అభిప్రాయం మేరకే పొత్తులు ఉంటాయని అంతేకాని కొందరి అభిప్రాయం మేరకు ఉండదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు . ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా పొత్తులపై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో పొత్తు గురించి కార్యకర్తలు ప్రస్తావించగా లవ్ వన్ సైడ్ ఉండదుకదా అని అన్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ పొత్తుల విషయం పార్టీలో నాయకులూ తలొక మాట మాట్లాడవద్దని అందరిదీ ఒకే మాటలా ఉండాలని సూచించారు. అనేక మంది పొత్తులకు వస్తారని ప్రస్తుతం మనం బీజేపీతో ఉన్నామని అందువల్ల పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు అప్పుడు పరిస్థితులను భట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అందువల్ల ఎవరు ఎక్కడ తొందర పడవద్దని హితవు పలికారు.

ఇటీవల రష్యా పర్యటన ముగించుకుని వచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో ఆయన ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులపై తమ వైఖరి వెల్లడించారు. ప్రతి కార్యకర్త అభిప్రాయం మేరకే పొత్తు ఉంటుందని, జనసైనికుల ఆలోచన తెలుసుకున్నాకే 2024లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమకు బీజేపీతో పొత్తు ఉందని వెల్లడించారు.

ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలన్న విషయం కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేశారని, అయినప్పటికీ తానొక్కడినే పొత్తుపై నిర్ణయం తీసుకోలేనని తెలిపారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని, అయితే ఆయా రాజకీయ పార్టీల ఎత్తుగడల పట్ల జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, వచ్చే ఎన్నికల నాటి వరకు ఒకే మాటపై ఉండాలని పవన్ కల్యాణ్ ఉద్బోధించారు.

Related posts

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. శాంతించని ప్రతిపక్షాలు!

Drukpadam

రేపే ఢిల్లీలో దీదీ నేతృత్వంలో కీలక సమావేశం… సీపీఎం దూరం..

Drukpadam

నిధులు మళ్లించటంలో టీడీపీ ,వైసీపీ దొందు దొందే …బీజేపీ ఎంపీ జీవీఎల్!

Drukpadam

Leave a Comment