Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

‘రాహుల్ కనెక్ట్ యాప్’, ఊరూరా వాట్సాప్ గ్రూపులు.. చకచకా పావులు కదిపేస్తున్న కాంగ్రెస్!

‘రాహుల్ కనెక్ట్ యాప్’, ఊరూరా వాట్సాప్ గ్రూపులు.. చకచకా పావులు కదిపేస్తున్న కాంగ్రెస్!

  • లోక్ సభ ఎన్నికలకు ఇప్పట్నుంచే అధిష్ఠానం సన్నద్ధం
  • రాహుల్ కు పార్టీ పగ్గాలనూ ఇచ్చేందుకు చర్యలు
  • మారుమూల ప్రాంతానికీ పార్టీ ప్రచారాలు చేరేలా డిజిటల్ ప్రచారం
  • రాహుల్ తో పార్టీ కేడర్ టచ్ లో ఉండేందుకు యాప్

2014, 2019 పరాభవాలను చెరిపేసేందుకు కాంగ్రెస్ పరితపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనైనా బీజేపీని ఢీకొట్టి.. అధికారాన్ని చేపట్టేందుకు ఎన్నెన్నో ఎత్తులు వేస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికలకు, పార్టీ పగ్గాలను రాహుల్ కు అప్పగించే లక్ష్యంగా ఆ పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. దేశంలోని మారుమూల ప్రాంతానికీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, సందేశాలు, ప్రచారాలు చేరేలా వాట్సాప్ గ్రూపులు, ‘రాహుల్/ఆర్జీ కనెక్ట్’ పేరుతో ఓ యాప్ ను సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

నియోజకవర్గం, జోన్, బూత్ లెవెల్లో రాజకీయ ప్రచారం చేసేందుకు, ఓటర్లకు పార్టీ సందేశాన్నిచ్చేందుకు డిజిటల్ మార్గాన్ని కాంగ్రెస్ ఎంచుకుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ కనెక్ట్ యాప్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీ కేడర్ తో ఆన్ లైన్ లో టచ్ లో ఉండాలని, తద్వారా వచ్చే ఎన్నికల నాటికి ఆన్ లైన్ లో పార్టీ ప్రభావాన్ని పెంచాలని భావిస్తోంది.

‘‘రాహుల్ కనెక్ట్ యాప్ ను త్వరలోనే ప్రారంభిస్తారు. ఆ యాప్ ద్వారానే ప్రచారాన్ని నిర్వహిస్తారు. ప్రచారానికి సంబంధించిన కథనాలు, సందేశాలను ఆ యాప్ తో కనెక్ట్ అయిన వారికి పంపిస్తారు. వారు వాటిని.. స్థానిక నేతలకు పంపిచాల్సి ఉంటుంది. వారంతా వారి వారి వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లలో ఆ ప్రచారాలు, సందేశాలను పోస్ట్ చేయాలి. ఓటర్లు, ప్రజలకూ చేరేలా చూడాలి’’ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత చెప్పారు.

వాస్తవానికి తొలుత రాష్ట్రాల వారీగానే వాట్సాప్ గ్రూపులు సృష్టించాలనుకున్నా.. ఆ తర్వాత జోన్లు, నియోజకవర్గాలు, బూత్ లెవెల్ వారీగా కూడా క్రియేట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సంకల్పించిందని అంటున్నారు. పార్టీలో క్రియాశీలంగా ఉన్న నేతలందరినీ ఈ కార్యక్రమంలో భాగం చేయనున్నట్టు సమాచారం.

కాగా, రాహుల్ కనెక్ట్ యాప్ తో ఆయనే పార్టీ అధ్యక్షుడని అధిష్ఠానం చెప్పకనే చెప్పిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పార్టీ అధ్యక్ష, కార్యనిర్వాహక ఎన్నికలను నిర్వహించనున్నారు. దానికి సన్నాహకంగానూ ఈ యాప్ ను తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు. ఈ ఒక్క యాప్ తోనే ఇటు రాహుల్ ను జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. లోక్ సభ ఎన్నికల కోసం ఇప్పట్నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోందన్నమాట. ప్రస్తుతం పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా సాగుతోంది.

Related posts

నిన్న, మొన్న వచ్చినవారికి మంత్రి పదవులు…ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

Drukpadam

మోడీ సేవలు సంపన్నుల కోసమే…ప్రముఖ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి…

Drukpadam

కుప్పం సభలో జగన్ సర్కార్ పై చంద్రబాబు నిప్పులు…

Drukpadam

Leave a Comment