Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం …మండలంలో 10 వేల చేర్పిస్తే రాహుల్ తో సన్మానం!

ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం …మండలంలో 10 వేల చేర్పిస్తే రాహుల్ తో సన్మానం!
-30 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడి
-జనవరి చివరినాటికి సభ్యత్వం పూర్తీ చేయాలి
-సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 2 లక్షల ప్రమాద బీమా

కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టింది. తెలంగాణాలో 30 లక్షల సభ్యత్వం టార్గెట్ గా పెట్టుకున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో సభ్యత్వ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుందని రేవంత్ తెలిపారు . ప్రజల నుంచి మంచి స్పందన ఉందని కాంగ్రెస్ సభ్యత్వం తీసుకునేందుకు అనేక వర్గాల వారు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు . ఇది కాంగ్రెస్ పార్టీకి శుభపరిణామం అని తాము భావిస్తున్నామన్నారు జనవరి 26 నాటికీ సభ్యత్వం చేర్పించాలని తొలుత కార్యక్రమం తీసుకున్నప్పటికీ కరోనా వల్ల కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అన్నారు .

తెలంగాణలో 30 లక్షల పార్టీ సభ్యత్వాలను చేయించి తీరుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సభ్యత్వాలను చేయించడానికి జనవరి 26 వరకు గడువు పెట్టుకున్నామని… అయితే కరోనా నేపథ్యంలో గడువును పెంచామని తెలిపారు. ఇప్పటి వరకు 7 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని చెప్పారు. ప్రతి బూత్ నుంచి 100 మంది సభ్యత్వాలను నమోదు చేయించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు.

సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 2 లక్షల ప్రమాద బీమాను అందిస్తామని చెప్పారు. దీని కోసం న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు ప్రమాదంలో మరణం సంభవిస్తే రూ. 2 లక్షల పరిహారం అందుతుందని, గాయపడితే ప్రమాదం తీవ్రతను బట్టి పరిహారం లభిస్తుందని చెప్పారు. మండల స్థాయిలో 10 వేలు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 50 వేలు, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో 3.5 లక్షల సభ్యత్వాలను చేయించిన వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తామని తెలిపారు.

Related posts

కుట్రదారుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సీఎల్పీ నేత భట్టి !

Drukpadam

ఈటల , విశ్వేశ్వరరెడ్డి కలయిక బంధుత్వమా ? రాజకీయమా ?

Drukpadam

ఎన్డీయే, ప్రతిపక్ష కూటమికి సమాన దూరంగా టీడీపీ…!

Drukpadam

Leave a Comment