రాజకీయాల్లోకి ,చట్టసభలకు రావడం జరగదుగాక జరగదు …చిరంజీవి!
-దయచేసి ఊహాగానాలను ప్రచారం చేయవద్దు
-’వైసీపీ రాజ్యసభ టికెట్’ అంటూ జరుగుతున్న ప్రచారం అర్థరహితం
-సినీ పరిశ్రమ పై జరిగిన చర్చలు పక్కదారి పట్టించేందుకే ఎలాంటి ప్రచారం
-ఏపీ సీఎంతో చిరంజీవి ఏకాంత భేటీ
-రాజ్యసభకు పంపుతున్నారంటూ ప్రచారం
-తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యానన్న చిరంజీవి
-ఇది కేవలం ప్రచారమేనని వ్యాఖ్య
తాను రాజకీయాల్లోకిగాని చట్టసభల్లోకి రావడం జరగదుగాక జరగదని మెగాస్టార్ చిరంజీవి తేల్చి చెప్పారు. ఏపీ సీఎం చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ ఇచ్చారని ,ఆయన రాజ్యసభకు వెళుతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పష్టత నిచ్చారు. పూర్తిగా నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తున్నారు.తాను రాజకీయాలకు దూరంగా ఉన్నాను . చట్టసభలకు వచ్చే ప్రశ్నలేదు . అందువల్ల ఇలాంటి ఆధారరహిత వార్తలు ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడంలేదు . దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి అని మీడియా ని చిరంజీవి కోరారు . ఏపీ సీఎం జగన్ ను తాను కేవలం సినీపరిశ్రమ కోసమే కలిశానని అన్నారు. తమమధ్య రాజసభ చర్చ జరగలేదని జారుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు . ఈ రోజు కుటుంబసభ్యులతో గన్నవరం విమాశ్రయానికి వచ్చిన చిరంజీవి మీడియా తో మాట్లాడారు .
చిరంజీవికి రాజ్యసభ టికెట్ అంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది. గతంలోనూ ఇప్పుడు చిరంజీవి ఏపీ సీఎంను కలిసినపుడు రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారని త్వరలో ఆయన వైసీపీ తరుపున రాజ్యసభకు వెళ్లనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరగటం దానిపై ఆయన వివరణ ఇవ్వడం జరుగుతూనే ఉంది. గతంలోకి భిన్నంగా ఈసారి చిరంజీవి ఏపీ సీఎం జగన్ కలిసేందుకు ఒంటరిగా వచ్చారు . దీంతో ఊహాగానాలకు మరింత పదునెక్కింది .ప్రత్యేకించి కొన్ని పత్రికల్లో ఈ విషయం ప్రముఖంగా ప్రస్తావించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం ఆశక్తిగా మారింది. దీంతో చిరంజీవి స్వయంగా స్పందించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని అలాంటి తనకు రాజ్యసభ ఎలా ఆఫర్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తమ చర్చల్లో అలాంటి ప్రస్తావన రాలేదనే ధోరణిలో ఆయన మాట్లాడారు . అయితే వన్ టు వన్ మీటింగ్ అయినందున ఏమి మాట్లాడుకున్నారు అనేది వారిలో ఎవరో ఒకరు చెపితేగాని బయటకు వచ్చే అవకాశం లేదు . ఈభేటీ సినిమా ఇండస్ట్రీకి జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించేందుకు దోహదపడిందని అటు సినీ పరిశ్రమ వర్గాలు ,ఇటు వైసీపీ శ్రేణుకు అభిప్రాయపడుతున్నాయి. అయితే చిరంజీవికి రాజ్యసభ ఇస్తే మంచిదేనని కొందరు .ఆయనకు అది చిన్నపదవి అని మరికొందరు అభిప్రాయపడుతుండగా , ఆయన గవర్నర్ లాంటి పోస్ట్ కు ఇష్టపడతారని మరిపొందారు అంటున్నారు .
నిన్న ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సినిమా టికెట్ల అంశంపై సీఎంతో చర్చించానని స్వయంగా చిరంజీవి వెల్లడించారు. అయితే, చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తున్నారంటూ ప్రచారం మొదలైంది.
దీనిపై చిరంజీవి స్పందించారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యానని స్పష్టం చేశారు. తనకు రాజ్యసభ టికెట్ అనేది కేవలం ప్రచారమేనని వెల్లడించారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
కాగా, చిరంజీవి ఈ సాయంత్రం మళ్లీ ఏపీకి రానున్నారు. సాయంత్రం 5 గంటలకు కుటుంబ సమేతంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. డోకిపర్రులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే గోదాదేవి కల్యాణోత్సవానికి చిరంజీవి కుటుంబం హాజరు కానుంది.