Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆప్ పిలుపునకు విశేష స్పందన 24 గంటల్లో 8 లక్షల మంది సీఎం అభ్యర్థిపై ఓటు!

ఆప్ పిలుపునకు విశేష స్పందన 24 గంటల్లో 8 లక్షల మంది సీఎం అభ్యర్థిపై ఓటు!
జనవరి 17 వరకు అవకాశం ఓటు వేసే అవకాశం
ఆ తర్వాత పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ప్రకటన
ప్రజాభిప్రాయానికి పెద్ద పీట

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిలో మీకు నచ్చిన వారికి ఓటు వేయాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వస్తోంది. మొదటి 24 గంటల్లోనే 8 లక్షల మందికి పైగా స్పందించారు. పార్టీ పేర్కొన్న అభ్యర్థుల్లో తమ ఓటు ఎవరికో తెలిపారు.

‘జనతా చునేగి ఆప్నా సీఎం’ పేరుతో ఆప్ ఒక సర్వే నిర్వహిస్తోంది. ఆప్ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత హర్పాల్ సింగ్ చీమా ఈ వివరాలు వెల్లడించారు. ‘‘వాట్సాప్ సందేశాల ద్వారా 3 లక్షల మందికి పైగా అభిప్రాయాలు తెలియజేశారు. నాలుగు లక్షలకు పైగా ఫోన్ కాల్స్, 50,000 మందికి పైగా మెస్సే జ్ లు పంపించారు. ఒక లక్షకు పైగా వాయిస్ మెస్సేజీల రూపంలో సీఎంగా ఎవరు తమకు సమ్మతమని తెలియజేశారు’’ అని చీమా తెలిపారు.

అందరి అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని చీమా పేర్కొన్నారు. సీఎం అభ్యర్థుల జాబితా నుంచి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన పేరును మినహాయించుకున్నారు. జనవరి 17 సాయంత్రం 5 గంటల వరకు తమ అభిప్రాయాలను పంజాబ్ ప్రజలు తెలియజేసేందుకు ఆప్ అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకునే అవకాశం ప్రజలకే కల్పించడం ఇదే మొదటిసారి.

Related posts

‘కాట్సా’ చట్టం నుంచి భారత్ కు మినహాయింపులు ఇవ్వలేం: అమెరికా!

Drukpadam

ఆఫ్ఘన్ ఉగ్రవాదులకు అడ్డా కాబోదు ,కానివ్వం: తాలిబ‌న్లు…

Drukpadam

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో రికార్డ్ స్థాయిలో 88 శాతం పోలింగ్

Drukpadam

Leave a Comment