Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ వైపు చూస్తున్న ములాయం సింగ్ చిన్న కోడలు!

బీజేపీ వైపు చూస్తున్న ములాయం సింగ్ చిన్న కోడలు

  • ములాయం చిన్న కోడలు అపర్ణాయాదవ్ చర్చలు
  • టికెట్ ఇచ్చేట్టు అయితే చేరేందుకు సమ్మతి
  • కొత్త స్థానంలో పోటీకి దింపాలన్నది కమలం వ్యూహం

కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోరుకు ముందు బీజేపీ నేతలను ఆకర్షించేందుకు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఒకవైపు ప్రయత్నిస్తుంటే.. ఆయనకు చెక్ పెట్టేందుకు బీజేపీ పోటీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలను అఖిలేశ్ ఎస్పీలో చేర్చుకున్నారు. అటు బీజేపీ కూడా ఎస్పీ నుంచి ఇక ఎమ్మెల్యేకు ఇప్పటికే పార్టీ కండువా కప్పింది.

ఇప్పుడు ఏకంగా ములాయం సింగ్ యాదవ్ ఇంటి సభ్యురాలినే తమ పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోందన్నది తాజా సమాచారం. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్, బీజేపీకి మధ్య చర్చలు కొన్ని రోజులుగా నడుస్తున్నట్టు పార్టీ వర్గాల కథనం. ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రావాల్సి ఉందంటున్నాయి.

అపర్ణా యాదవ్ 2017 ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ సీటు నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి రీతా బహుగుణ చేతిలో 33,976 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో తనకు లక్నో కంటోన్మెట్ టికెట్ ఇచ్చేట్టు అయితే బీజేపీలో చేరి పోటీ చేయాలని అపర్ణా యాదవ్ భావిస్తున్నారు. కాకపోతే ఆమెను గతంలో పోటీ చేసిన చోట కాకుండా, వేరే స్థానం నుంచి రంగంలోకి దింపాలని బీజేపీ అనుకుంటోంది.

Related posts

షబ్బీర్ అలీ టార్గెట్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో బాంబ్ ….

Drukpadam

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టికెట్స్ ఆశిస్తున్నవారి జాబితా …!

Drukpadam

గజినీ వేషాలు ఇప్పటికైనా మానుకో: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!

Drukpadam

Leave a Comment