Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రోహిత్ వేములను స్మరించుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక!

రోహిత్ వేములను స్మరించుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక!

  • హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో కుల కలకలం
  • పీహెచ్ డీ సాల్కర్ రోహిత్ వేముల ఆత్మహత్య
  • 2016 జనవరి 17న ఘటన
  • నేడు దేశవ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు
Rahul Gandhi and Priyanka Gandhi tributes to Rohit Vemula

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. 2016లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కులవివక్ష అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. అప్పటినుంచి విద్యాసంస్థల్లో కుల వివక్ష గురించి చర్చించుకునే ప్రతిసారి రోహిత్ వేముల పేరు ప్రస్తావిస్తున్నారు. 2016 జనవరి 17న రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి ప్రియాంక గాంధీ కూడా రోహిత్ వేములను స్మరించుకున్నారు. రోహిత్ వేములను కులవివక్షే చంపేసిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అతడి దళిత అస్తిత్వాన్ని తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. సంవత్సరాలు గడిచిపోయాయని, ఇప్పటికీ రోహిత్ వేముల తిరుగుబాటుకు ప్రతీకలా, అతడి తల్లి ఆశాభావానికి నిదర్శనంగా కొనసాగుతున్నారని వివరించారు. “అన్యాయానికి గురై, చివరి వరకు పోరాడిన రోహిత్ వేముల నా హీరో, నా సోదరుడు” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

అటు, ప్రియాంక గాంధీ స్పందిస్తూ, సామాజిక న్యాయం కోసం రోహిత్ వేముల బలమైన గొంతుక వినిపించాడని కొనియాడారు. దేశంలోని దళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, రోహిత్ వేముల ప్రారంభించిన సామాజిక న్యాయం కోసం పోరును తాము మరింత ముందుకు తీసుకెళతామని ప్రియాంక పేర్కొన్నారు.

Related posts

దటీస్ చింతమనేని ….కోడిపందేలు నా వ్యసనం అంటూ కుండబద్దలు కొట్టిన ప్రభాకర్!

Drukpadam

షర్మిలతో పాటు దీక్షలో కూర్చున్న విజయమ్మ!

Drukpadam

టీఆర్ యస్ లో మునుగోడు లొల్లి ….మాజీఎంపీ బూరనరసయ్య గౌడ్ తీవ్ర అసంతృప్తి !

Drukpadam

Leave a Comment