Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ లో పొంగులేటి ,మాజీమంత్రి తుమ్మలకు డోర్స్ క్లోజెనా ?

టీఆర్ యస్ లో పొంగులేటి ,మాజీమంత్రి తుమ్మలకు డోర్స్ క్లోజెనా ?
టీఆర్ యస్ అధినాయకత్వం వారి విన్నపాలను పట్టించుకోవడంలేదా?
అసెంబ్లీ ఎన్నికల్లోనూ , స్థానికసంస్థల ఎన్నికల్లో వెన్నుపోట్ల పర్వం
ఉమ్మడి జిల్లాలో పార్టీ సమన్వయం పై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారా ?
ఎమ్మెల్యేల బలంబలహీతలపై బేరీజు వేస్తున్నారా ?

ఖమ్మం జిల్లాలో టీఆర్ యస్ ముఖ్యనేతలుగా ఉన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు టీఆర్ యస్ డోర్స్ క్లోజ్ అయ్యాయా అంటే అవుననే అంటున్నాయి టీఆర్ యస్ వర్గాలు …. వారికీ ప్రగతి భవన్ లో సీఎం ఛాంబర్ ద్వారాలు ఎప్పుడో మూసుకున్నాయని …వారిపట్ల సీఎం కేసీఆర్ చాల సీరియస్ గా ఉన్నారని ….వారు వేరే దారి చూసుకుంటున్నారని …. అంతేకాకుండా జిల్లాలో పార్టీ పనితీరు , ఎమ్మెల్యేల పని విధానం పై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని ఎప్పటినుంచో జరుగుతున్న ప్రచారం …దీంతో పొంగులేటి , తుమ్మల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు . వారి రాజకీయ అడుగులు ఎలా ఉంటాయోనని జిల్లా రాజకీయాల్లో ఆశక్తికర చర్చగా మారింది . ఇద్దరూ..ఇద్దరే జిల్లా అంతటా పలుకుబడి , సహచరుల బలం బలగం ఉన్నవారు …వారిని అంత తేలిగ్గా టీఆర్ యస్ వదులు కుంటుందా ?అనే సందేహాలు కూడా లేకపోలేదు …అయితే జిల్లా టీఆర్ యస్ లో ఉన్న కొందరు ముఖ్యనేతలు వారిని వదిలించుకోవాలని దీంతో జిల్లాలో తమకు తిరుగులేని ఆధిపత్యం వస్తుందని భావిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి . వారిని ప్రజల్లో బలహీనపరచటం ద్వారా పార్టీకి దూరంగా పెట్టాలని లేదా వారే దూరం అయ్యేలా చేయాలనీ గుససుసలు వినిపిస్తున్నాయి . అయితే ఈ ఇద్దరు నేతలు తమకు అవకాశం దొరికితే ప్రజల మధ్య నిత్యం తిరుగుతూ ప్రజాభిమానం చూరగొంటున్నారు. ఇప్పటికే ఇద్దరికీ టీఆర్ యస్ లో అన్యాయం జరిగిందని ,పొంగులేటి కి ఎంపీ సీటు ఇవ్వలేదని , తుమ్మలని సొంత పార్టీ వారే ఓడించారని ప్రజల్లో వారిపట్ల సానుభూతి ఉంది. ఒకవేళ టీఆర్ యస్ పూర్తిగా విస్మరిస్తే వారి అడుగులు ఎటువైపు అనే ఆశక్తి కూడా నెలకొన్నది . వారి మనుసులో ఏమున్నా టీఆర్ యస్ లోనే ఉన్నారు . అడపదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీలో తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

టీఆర్ యస్ పార్టీ లో ఖమ్మం జిల్లాది ఒక ప్రత్యేకత …రాష్ట్రమంతా టీఆర్ యస్ స్వీప్ చేసినప్పటికీ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014 ,2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 అసెంబ్లీ సీట్లకు గాను ఒక్కక్క సీట్ లోనే టీఆర్ యస్ గెలిచింది . మిగతా 9 నియోజకవర్గాలు ప్రతిపక్షాలు గెలుచుకున్నాయి. అయితే గెలిచిన వారిలో ఒకరిద్దరు మినహా మిగతా వాళ్లంతా జై టీఆర్ యస్ అన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచినా జలగం వెంకట్రావు కు మంత్రి పదవి ఇవ్వకుండా , ఖమ్మం అసెంబ్లీకి టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించి మంత్రి పదవి ఇచ్చి , ఎమ్మెల్సీగా చేశారు. తరువాత పాలేరు నియోజకవర్గానికి వచ్చిన ఉపఎన్నికల్లో తుమ్మల పోటీచేసి భారీ మెజార్టీ తో గెలుపొందారు . మంత్రిగా నియోజకవర్గంలో తనదైన ముద్రవేశారు . అయినప్పటికీ 2018 ఎన్నికల్లో తిరిగి పాలేరు నుంచి పోటీచేసిన తుమ్మల రాజకీయాలకు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేదర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే స్వంత పార్టీ నుంచే పథకం ప్రకారం తనను ఓడించారని తుమ్మల బలంగా నమ్ముతున్నారు. సీఎం కేసీఆర్ సైతం ఖమ్మం జిల్లాలో తమ కత్తులు తమనే పొడిచాయని వ్యాఖ్యానించారు. ఓటమి తరువాత తుమ్మలకు సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన విధంగా అపాయింట్మెంట్ ఇవ్వడం మానేశారు. సీనియర్ గా అనుభవం ఉన్న తుమ్మలను తిరిగి ఎమ్మెల్సీగా తీసుకోని మంత్రి పదవి ఇస్తారని ఆయన వర్గీయులు ప్రచారం చేసారు. కానీ మంత్రి వర్గ విస్తరణలో ఖమ్మం నుంచి ఏకైక టీఆర్ యస్ సభ్యుడిగా గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ కు మంత్రి పదవి దక్కింది . దీంతో తుమ్మల ఆశలకు గండి పడింది. తుమ్మల పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పలుమార్లు ఖండించారు. కేసీఆర్ తుమ్మలపై సీరియస్ గా ఉన్నారని జిల్లాలో పార్టీని తుమ్మల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు నాశనం చేశారని సీఎం అన్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుత జిల్లాలో నాయకత్వ సమస్య ఉందని సమన్వయం చేసుకోలేక పోతున్నారని సీఎం కేసీఆర్ పలువురు మంత్రుల ముందే అన్నట్లు టీఆర్ యస్ వర్గాలే గుసగుస లాడుకున్నాయి. ఇదే నిజమైతే జిల్లాలో భారీ మార్పులకు సీఎం కేసీఆర్ వెనకాడరని అంటున్నారు . పార్టీకి చేటు తెచ్చే పెద్ద నాయకులు పోయిన ఫర్వాలేదనే అభిప్రాయంతో అధినేత ఉన్నట్లు సమాచారం

ఎన్నికల కోసం టీఆర్ యస్ అధిష్టానం ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించింది.ఈసారి ఎన్నికల్లో పార్టీ అధికంగా శ్రమించాలని గుర్తించింది. అందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ అందరికి టికెట్స్ ఇస్తామని , గెలిపించే భాద్యత కూడా తనదేనని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. అయితే 2018 అసెంబ్లీ ,2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే విధంగా కేసీఆర్ ప్రకటించారు. కానీ కొందరు ఎమ్మెల్యేలకు , ఎంపీలకు టికెట్స్ ఇవ్వలేదు . దీంతో కేసీఆర్ మాటలపై పార్టీలోనే సందేహాలు నెలకొన్నాయి . ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో తమపార్టీ నేతలు తమకు వెన్నుపోటు పొడిచారని అధిష్టానానికి రిపోర్ట్ వెళ్ళింది. దీంతో అధినేత కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది. చూద్దాం ఏమి జరుగుతుందో ….

Related posts

పవన్ విమర్శలు నిజమా….?కాకపోతే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు ..!

Drukpadam

కేసీఆర్ వ్యాఖ్యలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలయింది: కడియం శ్రీహరి!

Drukpadam

రాజశేఖర్ రెడ్డిని తిడితే చెంప చెళ్లుమనిపిస్తాం …తెలంగాణ మంత్రులకు రేవంత్ వార్నింగ్…

Drukpadam

Leave a Comment