Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రతిపక్షాలపై ఈడీ కక్ష …అవి రాజకీయ ప్రేరేపితం అంటున్న విశ్లేషకులు!

ప్రతిపక్షాలపై ఈడీ కక్ష …అవి రాజకీయ ప్రేరేపితం అంటున్న విశ్లేషకులు!
పంజాబ్ ముఖ్యమంత్రి బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు
ఇసుక కాంట్రాక్టుల్లో అక్రమాలపై ఆరా
సీఎం మేనల్లుడు భూపిందర్ కు ఇసుక కాంట్రాక్టులు
చిన్న కంపెనీ కాంట్రాక్టులు పొందడంపై సందేహాలు
రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో సోదాలు

ప్రతిపక్ష పార్టీ వ్యక్తులే లక్ష్యంగా ఈడీ దాడులు చేస్తుందనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి . దాన్ని అక్షర సత్యం చేస్తూ పంజాబ్ లో కాంగ్రెస్ సీఎం గా ఉన్న చరణ్ జీత్ సింగ్ చన్నీ బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు చేస్తుందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా ఆరాష్ట్రముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంధువులు అనుయాయులు ఇళ్లపై ఈడీ దాడులు జరిపిన విషయం విదితమే . అదే విధంగా ఇటీవల యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రంలో ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ సమీప బంధువులు , సన్నిహితుల ఇళ్లపై ఈడీ ,ఐ టీ శాఖలు దాడులు జరిపాయి . ఇవన్నీ పొలిటికల్ మోటివేటడ్ దాడులేనని ప్రజలు భావిస్టున్నప్పటికీ వారిని దెబ్బతీయాలని కేంద్రం ఎత్తులు వేస్తూ తమ చేతిలో ఉన్న ఈడీ ,ఇన్ కం టెక్స్ లను ఉపయోగిస్తున్నదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పంజాబ్ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో పరిణామాలు మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని బంధువుల నివాసాలలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. మొహాలీలో ముఖ్యమంత్రి మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ నివాసంతోపాటు 10 ప్రాంతాల్లోని నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు నడుస్తున్నాయి.

భూపిందర్ సింగ్ ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇసుక మైనింగ్ కాంట్రాక్టులను సంపాదించారు. మైనింగ్ కాంట్రాక్టులను సంపాదించేందుకు నల్లధనాన్ని ఇన్వెస్ట్ చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఎందుకంటే భూపిందర్ పెట్టిన కంపెనీ చాలా చిన్నది. అంత పెద్ద కాంట్రాక్టులు తీసుకునే స్థాయిలో లేకపోవడమే ఈ అనుమానాలకు నేపథ్యంగా ఉంది.

ఇసుక కాంట్రాక్టులు, ఇసుక మాఫియాపై ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నారని ఆప్ సైతం ఆరోపణలు గుప్పిస్తోంది.

Related posts

విశాఖ లో అడుగు పెట్టనివ్వం -ఏపీ సీఎం జగన్

Drukpadam

కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన షురూ ….ఐదు రాష్ట్రాల అధ్యక్షులు రాజీనామాకు ఆదేశం !

Drukpadam

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి?: బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్య

Drukpadam

Leave a Comment