ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డికి అవమానం!
- కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి
- అపాయింట్ మెంట్ లేకుండా లోపలకు పంపించలేమన్న అధికారులు
- కనీసం కేటీఆర్ ను కలుస్తానని అడిగిన జేసీ
జేసీ దివాకర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన మాజీ పార్లమెంట్ సభ్యుడు …విజయభాస్కరెడ్డి దగ్గరనుంచి ఆయన అందరు ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉన్నవాడు . ..కడుపులో ఏది పెట్టుకోకుండా అంతా వెళ్లగక్కుతాడనే పేరున్నవాడు … పర్మిట్ లేకుండానే బస్సు లు నడుపుతారని వారి ట్రావెల్స్ కు పేరుంది . తెలంగాణాలో కూడా ఆయన బస్సు లు వివిధ ప్రాంతాలకు నడుస్తున్నాయి.నిత్యం హైద్రాబాద్ కేంద్రంగా వారి వ్యాపారం సాగుతుంది. అప్పుడప్పుడు తెలంగాణ అసెంబ్లీ లో కూడా ప్రత్యక్షం అయి శలోక్తులతో అందరిని నవ్విస్తుంటారు . ఒకొక్కసారి అవి వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ సీఎల్పీ ఆఫీస్ కు వచ్చి వారిపై వేసిన సెటైర్లపై జీవన్ రెడ్డి తీవ్రంగానే స్పందించారు. నేడు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు వెళ్లేందుకు వచ్చారు . ప్రగతి భవన్ లో సెక్యూరిటీ ఆయన్ను అడ్డుకున్నారు . దానిపై వారితో వాగ్వివాదం జరిగింది. ముందుగా అపాయింట్మెంట్ ఉంటె మాకు ఎవరిని పంపించాలి ,అనేది సమాచారం వస్తుందని అందువల్ల మీరు అపాయింట్మెంట్ తీసుకోని రండని చెప్పినప్పటికీ వినకుండా కేటీఆర్ ను కలుస్తానని చెప్పినప్పటికీ సెక్యూరిటీ నిరాకరించడంతో చేసేది లేక వెనుదిరిగారు .
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, ఏపీ రాజకీయాల్లో కీలక నేత జేసీ దివాకర్ రెడ్డికి పరాభవం ఎదురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడానికి హైదరాబాదులోని ప్రగతి భవన్ కు వచ్చిన జేసీకి అవమానం జరిగింది. అపాయింట్ మెంట్ లేకుండా లోపలకు పంపించలేమంటూ అక్కడున్న సెక్యూరిటీ అధికారులు ఆయనను నిలువరించారు.
దీంతో సీఎంను కాకపోయినా… కనీసం మంత్రి కేటీఆర్ ను కలుస్తానని ఆయన అడిగారు. దానికి కూడా అధికారులు ససేమిరా అన్నారు. అనుమతి ఉంటేనే లోపలకు పంపిస్తామని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు.ఒకానొక సమయంలో సెక్యూరిటీ అధికారులతో జేసీ వాగ్వాదానికి దిగారు. తనకు అపాయింట్ మెంట్ ఇచ్చేదేమిటని ఆయన ప్రశ్నించారు. తాను లోపలకు వెళతానని వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండా లోపలకు పంపలేమని అధికారులు ఆయనకు స్పష్టం చేశారు. దీంతో ఆయన వెనుదిరిగారు.