Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ లో పీఆర్సీ పై పట్టు ,బెట్టు …ఎవరి వాదన వారిది!

ఏపీ లో పీఆర్సీ పై పట్టు ,బెట్టు …ఎవరి వాదన వారిది!
అటు ఉద్యోగులు ఇటు ప్రభుత్వం
తేడా పేడో అంటున్న ఉద్యోగులు
ఉద్యోగులను యూనియన్ నేతలు పక్కదోవ పట్టిస్తున్నారు పేర్ని నాని ఆగ్రహం
ఐఆర్ కింద రూ. 17,918 కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా?
పీఆర్సీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలి

 

పీఆర్సీ వ్యవహారంలో ఏపీ ఉద్యోగులు పోరాట బాట పట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ వారు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను యూనియన్ నేతలు పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. అటు ఉద్యోగులు ఇటు ప్రభుత్వం పట్టు బెట్టు మీద ఉన్నారు .దీంతో పీటముడి పడింది …ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఉద్యోగసంఘాల అందరు ఒకేమాట మీద ఉండాలని అందుకోసం సచివాలయంలో సమావేశమై కలిసి సమ్మె నోటీసు సీఎస్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు . మరో పక్క ఉపాద్యాసంఘాలు ఇప్పటికే ఆందోళన బాట పట్టాయి. రాష్ట్రవ్యాపితంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశాయి. ఉద్యోగులు నల్లబ్యాడ్జిలు ధరించారు.

గతంలో ఎప్పుడూ 27 శాతం ఐఆర్ ఇవ్వలేదని… ఐఆర్ కింద రూ. 17,918 కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఐఆర్ ను జీతంలో భాగంగా ఎలా పరిగణిస్తారని అడిగారు.

పీఆర్సీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోత పడుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జీతం పెరిగిందా? లేదా? అనే విషయాన్ని మాత్రమే చూడాలని అన్నారు. ఉద్యోగులు ఆశించినంత మేరకు చేయలేదనే బాధ తమకు కూడా ఉందని… గత్యంతరం లేని పరిస్థితుల వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని… ఈ విషయాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని అన్నారు. ఎవరో చెప్పిన మాటలు వినొద్దని కోరారు. 23 శాతం ఫిట్ మెంట్ ను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇస్తున్నామని… ఉద్యోగులపై ప్రేమ లేకనే సీఎం జగన్ ఇవన్నీ చేస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు.. సమ్మె తప్పదు: ఏపీ ఉద్యోగ సంఘాలు

 

పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ, చర్చల ద్వారా సంప్రదింపులు జరుపుకుని అందరం ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, డిమాండ్లను సాధించుకుంటామని తెలిపారు.

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. రేపు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో సమావేశమవుతున్నామని… అనంతరం తమ విధివిధానాలను వెల్లడిస్తామని తెలిపారు.

మరో నేత సూర్యనారాయణ మాట్లాడుతూ, పర్సనల్ అజెండా, అంతర్గత విభేదాలను పక్కన పెట్టి అందరం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అందరం ఒకే తాటిపైకి వచ్చి ఉద్యమించాలని నిర్ణయించామని తెలిపారు. రేపటి నుంచి ఉద్యోగులందరిదీ ఒకే మాట, ఒకే వాదన అని చెప్పారు.

సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందరం ఐకమత్యంగా ఒకే వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించామని చెప్పారు.

ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ, రేపు సచివాలయంలో సమావేశమై అన్ని డిమాండ్లపై చర్చించనున్నామని తెలిపారు. రేపు సీఎస్ కు సమ్మె నోటీసు ఇస్తామని చెప్పారు. సమ్మెపై వెనక్కి తగ్గే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

Related posts

ప‌రేడ్ గ్రౌండ్స్ స‌మీపంలో ‘మోదీ తప్పక సమాధానం చెప్పాలి’ పోస్ట‌ర్ల క‌ల‌క‌లం!

Drukpadam

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకోసం తెలుగుదేశం మాస్టర్ ప్లాన్ ..

Drukpadam

నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు టీడీపీవే.. లోకేశ్ పాదయాత్ర ఒక ప్రభంజనం: కోటంరెడ్డి

Drukpadam

Leave a Comment