Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆత్మహత్య చేసుకుంటా.. అనుమతించండి: కేటీఆర్ కు ఇంజినీరింగ్ చదివిన రైతు లేఖ!

ఆత్మహత్య చేసుకుంటా.. అనుమతించండి: కేటీఆర్ కు ఇంజినీరింగ్ చదివిన రైతు లేఖ

  • ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు
  • వ్యవసాయమే నా జీవనాధారం
  • నా భూమిని ప్రకృతి వనానికి తీసుకున్నారు

ఆత్మహత్య చేసుకునేందుకు తనకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను అనే రైతు మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడినని లేఖలో ఆయన తెలిపారు.

అయితే పల్లె ప్రకృతి వనానికి తన భూమిని తీసుకున్నారని… కొంత భూమిని గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కోసం సేకరించారని చెప్పారు. ఇంజినీరింగ్ చదివిన తనకు ఎలాంటి ఉద్యోగమూ లేదని… దీంతో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను రోడ్డున పడ్డానని, జీవనం దుర్భరంగా ఉందని, తాను చనిపోయేందుకు అనుమతించాలని కోరారు. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు, కనగల్ తహసీల్దార్ కు, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని వాపోయారు.

Related posts

మావోయిస్టుల దాడిలో ఐదుగురు పోలీసుల మృతి

Drukpadam

కోడి ముందా? గుడ్డు ముందా..? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందోచ్..!

Drukpadam

అభిమాని అత్యుత్సాహం…ప్రమాదం తప్పించుకున్న పవన్ కల్యాణ్!

Drukpadam

Leave a Comment