Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

35 యూట్యూబ్ చానళ్లు, 2 వెబ్ సైట్లపై నిషేధం విధించిన కేంద్రం!

35 యూట్యూబ్ చానళ్లు, 2 వెబ్ సైట్లపై నిషేధం విధించిన కేంద్రం!

  • భారత్ వ్యతిరేక ప్రచారం చేస్తున్న చానళ్లు
  • పాకిస్థాన్ కు చెందిన యూట్యూబ్ చానళ్లుగా గుర్తింపు
  • ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయన్న కేంద్రం

సోషల్ మీడియా నియంత్రణపై తీవ్రంగా దృష్టి సారించిన కేంద్రం తాజాగా పెద్ద సంఖ్యలో యూట్యూబ్ చానళ్లపై నిషేధం వేటు వేసింది. అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయంటూ 35 యూట్యూబ్ చానళ్లతో పాటు రెండు వెబ్ సైట్లపైనా కేంద్రం కొరడా ఝళిపించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్ గడ్డపై నుంచి నడుస్తున్న ఈ యూట్యూబ్ న్యూస్ చానళ్లు, వెబ్ సైట్లు భారతదేశానికి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ వ్యాపింపజేస్తున్నాయని కేంద్రం ఆరోపించింది.

కాగా, ఈ యూట్యూబ్ చానళ్లకు 1.2 కోట్ల మంది సబ్ స్ర్కైబర్లు ఉండగా, వీటి వీడియోలను 130 కోట్ల మంది వీక్షించినట్టు సమాచార మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, కొన్ని పాకిస్థానీ సోషల్ మీడియా ఖాతాలను కూడా కేంద్రం నిషేధించింది. కేంద్రం నిషేధించిన వాటిలో రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్ స్టాగ్రామ్ ఖాతాలు, ఒక ఫేస్ బుక్ ఖాతా ఉన్నాయి.

Related posts

అమెరికాలో టోర్నడో విలయతాండవం… 100 మంది బలి!

Drukpadam

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అమెరికా డాలర్‌: ఉదయ్ కోటక్

Drukpadam

భానుడి భగభగలు …నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

Drukpadam

Leave a Comment